లాక్ డౌన్ కారణంగా జిమ్, ఫిట్ నెస్ సెంటర్లను మూసి వేసిన సంగతి తెలిసిందే. జిమ్ లలో ప్రతి రోజూ చెమటలు చిందించే ఫిట్ నెస్ ప్రియులు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాగని సైలెంట్ అయిపోలేదు వీళ్ళు.. ఛాన్స్ దొరికితే చాలు చెమటలు చిందిస్తూ ఉన్నారు. తాము ఇంత ఫిట్ గా ఉండేదుకు చేసే ప్రయత్నాలు ఏమిటి.. తినే తిండి ఏమిటి అని తమ ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు ఇళ్లల్లో ఎక్కడైనా సరే.. జిమ్ ఎక్విప్మెంట్ లేకుండా చాలా వ్యాయామాలు చేసేయొచ్చు అని చెబుతున్నారు. అలాగే పలు ఛాలెంజ్ లు విసురుతూ ఉన్నారు. ఇక ఫాలోవర్లంటారా.. మేడమ్/సార్ మీరు సూపర్ గా వ్యాయామాలు చేస్తున్నారు అని పొగుడుతూ కొందరు ఉంటే.. తాము కూడా మా ఫేవరెట్ స్టార్స్ కు ఏ మాత్రం తీసిపోమని అవే వ్యాయామాలను చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వారిని ట్యాగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం హెడ్ స్టాండ్ వ్యాయామం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తలక్రిందులుగా నిలబడి.. కాళ్లు గోడకు పెట్టి.. చేతులు కిందకు ఆనిచ్చి.. టీ షర్ట్ వేసుకోవాలనే ఛాలెంజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ టీ షర్ట్ ఛాలెంజ్ ను మొదట మొదలు పెట్టింది 'ది స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' స్టార్ టామ్ హోలాండ్. ఈ హాలీవుడ్ యంగ్ హీరో టీ షర్ట్ ఛాలెంజ్ ను అద్భుతంగా చేసి.. ఆ సినిమాలో విలన్ అయిన జేక్ గిలెన్హాల్ ను , అలాగే ర్యాన్ రెనాల్డ్స్ ను నామినేట్ చేశాడు. జేక్ అద్భుతంగా చేయగా.. ర్యాన్ రెనాల్డ్స్ ఛాలెంజ్ ను స్వీకరించడం లేదని చెప్పారు.

Also Read : అక్కడి దాకా వైరస్ వ్యాపించిందా..?

ఇక టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఛాలెంజ్ ను మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేసింది. హెడ్ స్టాండ్ వ్యాయామం అన్నది చాలా ఫన్ తో కూడుకున్న మంచి వ్యాయామం అని రకుల్ వివరించింది. మామూలుగా టీ షర్ట్ ను వేసుకోవడంలో కిక్కు ఏముంది.. ఇలా కూడా బాగుంటుందని చెప్పుకొచ్చింది. అలాగే తన స్నేహితురాలు, యాక్ట్రెస్ రియా చక్రవర్తిని, ఆకాంక్ష రంజన్ కపూర్ లను నామినేట్ చేసింది. చిరుత సినిమా హీరోయిన్ నేహా శర్మ, నటి మందిరా బేడీ లాంటి వాళ్ళు కూడా ఈ ఛాలెంజ్ ను అద్భుతంగా చేసి చూపించారు.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ పలువురు స్టార్స్ తమ ఫిట్నెస్ వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. తమన్నా లాంటి స్టార్స్ యోగా చేస్తూ తమ ఫాలోవర్లకు పలు సూచనలు ఇచ్చారు. మనుషుల్లోనే కాదు మనసుల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయని.. యోగా చాలా ముఖ్యమని అంటున్నారు. ఇళ్లల్లోనే నడుస్తూ కాజల్ ఫ్యామిలీ కూడా ఫిట్ గా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఇక లక్ష్మీ రాయ్ లాంటి వాళ్ళు మెట్లపైనే వాకింగ్ చేస్తూ ఫిట్నెస్ ను మెరుగు పరుచుకుంటూ ఉన్నారు. తమ ఫాలోవర్లకు కూడా ఫిట్ గా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read : 1700 కిలోమీటర్లు..16 గంటలు..7 రోజులు

రాణి యార్లగడ్డ

Next Story