కరోనా వైరస్ మహమ్మారిని అదుపు చేయలేకపోతున్నారు. ప్రపంచం లోని నలుమూలలా పాకిపోయింది ఈ వైరస్. బ్రెజిల్ దేశంలోని మారు మూల ప్రాంతంలో కూడా కోవిద్-19 వైరస్ వ్యాపించడం అధికారులను తెగ టెన్షన్ పెడుతోంది.

యనోమామి తెగకు చెందిన పిల్లాడు చనిపోయాడని బ్రెజిల్ అధికారులు శుక్రవారం నాడు వెల్లడించారు. అమెజాన్ అడవుల్లో నివసించే ఈ జాతి ప్రజలకు బయట ప్రపంచంతో సంబంధాలు అతి తక్కువ. అయినా కూడా అక్కడి పిల్లాడు చనిపోయాడంటే వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవాలి.

యనోమామి తెగకు చెందిన 15 సంవత్సరాల పిల్లాడికి మొట్టమొదటి సారిగా ఈ వైరస్ సోకింది. అతన్ని రొరైమా రాష్ట్ర రాజధాని అయిన బోవా విస్తాలోని ఆసుపత్రిలోని ఐసీయు వార్డుకు వారం కిందట తరలించారు. కానీ ఆ పిల్లాడు కోలుకోలేకపోయాడని.. చనిపోయాడని వైద్యులు తెలిపారు. గురువారం రాత్రి అతడికి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు రావడంతో చనిపోయాడని బ్రెజిలియన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి ఆ పిల్లాడు.. ఐసీయు లోనే ఉన్నాడని తెలుస్తోంది.

ఇతర వ్యక్తులతో ఆ పిల్లాడు కలిశాడని అందుకే అతడికి కరోనా వైరస్ సోకిందని యనోమామి హక్కుల సంఘం తెలిపింది. ఆ వ్యక్తుల్లో వైరస్ లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరకి ఈ పిల్లాడు వెళ్లాడని చెబుతున్నారు. హుతుకారా అసోసియేషన్ మాత్రం.. సరైన మెడికల్ హెల్త్ కేర్ తీసుకోకపోవడం వలనే మరణించాడని అన్నారు. రెండు వారల కిందటే ఆ పిల్లాడు వైద్యులను సంప్రదించాడని.. కానీ వైద్యులే సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

Also read:

దారుణం: అమెరికాలో 40 భారతీయులు మృతి[/also-read]

యనోమామి తెగ ప్రజలు నివసించే చోట.. అక్రమంగా బంగారం కోసం అన్వేషణ చేస్తూ ఉంటారు. ఆ బంగారు గనుల్లో పనిచేసే వాళ్ళతో ఈ కుర్రాడు కలిశాడని.. అప్పుడే వైరస్ సంక్రమించిందని అనుమానిస్తున్నారు అధికారులు. ఆ ప్రాంతాల్లో దాదాపు 20000 మందికి పైగా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. యనోమామి తెగ బ్రెజిల్, వెనుజులా సరిహద్దుల్లోని వర్షారణ్య ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. 38000 మంది పైగా జీవిస్తూ ఉన్నారు.

ఈ తెగల ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు కూడా ఉండవు.. ఒక్కరికి వైరస్ లాంటివి సోకితే చాలు.. మొత్తం తెగ మనుగడ కష్టమవుతుంది. శుక్రవారం నాటికి అందిన రికార్డుల ప్రకారం 18,176 కన్ఫర్ కేసులు నమోదయ్యాయి. 957 మందికి పైగా మరణించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.