'ఇంటి వద్దకే పెన్షన్'..
By Newsmeter.Network
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు పెన్షన్ కావాలంటే పెన్షన్ దారుడు ఆపీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇక పై ఆ అవరం లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. వాలంటీర్లు తమ స్మార్ట్ పోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో దాదాపు 54.64లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ ఒక్క రోజులోనే అది కూడా మధ్యాహ్నాం ఒంటి గంట లోపలే ఫించన్ పంపిణీ చేపట్టారు. పెన్షన్లు ప్రభుత్వం అందిస్తున్న తీరుపై పెన్షన్ దారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఎప్పుడు ఉంటే అప్పుడే ఇంటికొచ్చి మాకు వలంటీర్లు పింఛన్లు ఇస్తుండడం సంతోషంగా ఉందని, దీని వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.