'గో బ్యాక్ పవన్ కల్యాణ్'.. కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత

By సుభాష్
Published on : 12 Feb 2020 4:39 PM IST

గో బ్యాక్ పవన్ కల్యాణ్.. కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 2017లో అత్యాచారానికి గురైన మృతి చెందిన టెన్త్‌ క్లాస్‌ విద్యార్థిని సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ బుధవాంర ర్యాలీ చేపట్టేందుకు పవన్‌ కల్యాణ్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ కర్నూలుకు చేరుకున్నారు. పవన్‌ పర్యటనను అడ్డుకునేందుకు రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు ప్రయత్నించారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్‌.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గో బ్యాక్‌ పవన్‌ కల్యాణ్‌ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమకు పవన్‌ అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీంతో కర్నూలు కలెక్టరేట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Next Story