అమరావతి: కేబినెట్‌లో కీలక అంశాలపై చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకోస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రి వర్గం వివిధ అంశాలపై చర్చించింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్న నిర్ణయంతో పాటు ఆధారాలతో దొరికితే అభ్యర్థులపై అనర్హత వేడు పడుతుందన్నారు. అభ్యర్థులకు మూడేళ్ల జైలు శిక్ష కూడా పడేలా నిబంధనల్లో మార్పులు తీసుకోస్తామన్నారు. డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు 5 రోజులు ప్రచారం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 8 రోజులు ప్రచారం గడువు ఉంటుందని పేర్ని వివరించారు. నోటిఫికేషన్‌ వచ్చాక 15 రోజుల్లోగా ఎన్నికలు పూర్తవ్వాలని కేబినెట్‌ చర్చించామన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత సర్పంచ్‌లదే, సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండాల్సిందేనని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లును పెట్టాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

1 నుంచి 10వ తరగతి విద్యార్థుకుల జగనన్న విద్యాకానుక పథకం ద్వారా పుస్తకాల సంచులతో పాటు, నోటు పుస్తకాలు, మూడు జతల దుస్తులు, రెండు జతల బూట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చించారు. కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ నేరుగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

అంజి

Next Story