ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 11:50 AM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందిన 'అజ్ఞాతవాసి' సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయిన త‌ర్వాత ఇక సినిమాల్లో న‌టించ‌ను పూర్తి స‌మ‌యం రాజ‌కీయాల‌కే అంటూ రాజ‌కీయాల్లోకి వెళ్లారు. జ‌న‌సేన పార్టీ త‌రుపున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ రోజు ప‌వ‌న్ రీ ఎంట్రీ పై ఒక సంచలన ప్రకటన రావడం జరిగింది.

బాలీవుడ్ కి చెందిన ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్, తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పవన్ నటించబోయే తదుపరి సినిమా విషయమై ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇటీవల బాలీవుడ్ లో అనిరుద్ధా రాయ్ చౌదరి దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో రూపొందిన మంచి సక్సెస్ సాధించిన సోషల్ థ్రిల్లర్ మూవీ ‘పింక్’ అధికారిక రీమేక్ లో పవన్ నటించబోతున్నట్లు తరణ్ తెలిపారు.

ఈ సినిమాను ఇటీవల బోనీ కపూర్ తమిళ్ లో అజిత్ హీరోగా ‘నెర్కొండ పార్వై’ పేరుతో నిర్మించారు. అక్కడ కూడా మంచి విజ‌యం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి బోనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని, ఈ సినిమాకు ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎం సీ ఏ’ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారని తెలియ‌చేశారు. మ‌రి.. ప‌వ‌న్ రీ ఎంట్రీతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో చూడాలి.

Next Story
Share it