రోజురోజుకు విజృంభిస్తున్న మ‌హ‌మ్మారి కరోనా వైర‌స్ నివార‌ణ‌కై ప్రధాని మోదీ సూచనలను తెలుగు ప్రజలందరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇందులో బాగంగా ఈ నెల 22ను ప్ర‌ధాని పిలుపు మేర‌కు జనతా కర్ఫ్యూగా పాటిద్దామని అన్నారు. ఈ విష‌య‌మై ప‌వ‌న్ కొద్దిసేప‌టి క్రితం ఓ వీడియో సందేశం విడుద‌ల చేశారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలావుంటే.. కరోనా మహమ్మారిపై ప్రధాని మోదీ గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం విధిత‌మే. ఈ సంక్షోభం యావత్తు మానవాళిని చుట్టుముట్టిందన్న ఆయన.. దీనిపై పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌మైంద‌ని పిలుపునిచ్చారు. దీనిలో బాగంగా ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు.
జనతా కర్ఫ్యూ సమయంలో ఎవరూ తమ ఇల్లు, భవనం నుంచి బయటకు రావొద్దని కోరారు. మనల్ని మనం కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా సంయమనం పాటించాల‌ని అన్నారు. రాబోయే కొన్నిరోజులు ఎంతో ముఖ్యమైన పని ఉంటేనే గానీ.. ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటకు రావాలని అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.