దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2020 2:06 PM GMT
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) చైనాలో పుట్టి ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. రోజు రోజుకు ఈ మహమ్మారి విజృభిస్తోంది. భారత్‌లో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాలు ప్రమాదకరస్థాయిలో లేకున్నా.. కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం సాయంత్రానికి భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 167 కాగా నేడు(శుక్రవారం సాయంత్రానికి ) 223 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 32 మంది విదేశీయులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిన్నటివరకు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనే అధికంగా కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోనూ రెండంకెల సంఖ్యకు చేరాయి.

యూపీలో 22, ఢిల్లీలో 16, రాజస్థాన్ లో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర (49) అగ్రస్థానంలో ఉంది. కేరళలో 26, కర్ణాటకలో 15 మంది కరోనా బాధితులు ఉన్నట్టు గుర్తించారు. ఇక ఏపీలో 3, తెలంగాణలో 8 కేసులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నలుగురు కరోనాతో మరణించారు.

Next Story