జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మళ్లీ ఢిల్లీకి పయనమయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఎంపీ జీవిఎల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా పవన్‌ భేటీ కానున్నారు.

ఇక ఢిల్లీ పర్యటన ముగిసేలోపు ప్రధాని నరేంద్రమోదీని కూడా కలువనున్నట్లు తెలుస్తోంది. నాందేండ్ల మనోహర్‌తోకలిసి ఢిల్లీ వెళ్లిన పవన్‌.. రాజధాని అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక మంగళవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరిలో భేటీ అయిన కన్నాలక్ష్మీనారాయణ, రావెల కిశోర్‌బాబు తదితరులు రాజధాని అంశంపై జాతీయ స్థాయిలో తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. ఇక నుంచి ఏపీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు పవన్‌ కల్యాణ్‌ను కూడా సంప్రదించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.