Fact Check : బిల్ గేట్స్ 2015 లోనే N95 మాస్క్ పేటెంట్ పొందారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 July 2020 10:11 AM GMTకరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కోడానికి ఇప్పటికే ఎన్నో దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆక్స్ ఫర్డ్ కు చెందిన వ్యాక్సిన్ మీద ఇప్పటికే ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఈ వ్యాక్సిన్ సక్సెస్ అవుతుందని ధీమాగా చెబుతున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.
తాజాగా ఓ మెసేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఎన్ 95 మాస్క్ గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. 2015 లోనే ఎన్ 95 మాస్క్ పేటెంట్ల కోసం ప్రయత్నించారని.. చూస్తుంటే వైరస్ అటాక్ ను ముందే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.
Kind of odd, don’t you think? In 2015, under the Obama administration, Christopher Harrington attempted to file a patent for a new design of face mask with a serial number of CV19-N95. Do those numbers look familiar to you? The patent was denied because a similar one had already been filed 6 months prior, by who?? You guessed it, Bill Gates. We are being controlled, people. Was this planned years ago?
Kinda odd, don’t you think?#N95mask pic.twitter.com/4GolP5Ewj7
— JIHAD DOG$ ☪️☠️🧫🦠💉 (@Jihad_Dogs) July 21, 2020
2015 లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్న సమయంలో క్రిస్టోఫర్ హ్యారింగ్టన్ CV19-N95 ఫేస్ మాస్క్ పేటెంట్ కోసం ప్రయత్నించాడు.. కానీ అతడికి పేటెంట్ హక్కులు ఇవ్వలేదు. ఆరు నెలల కంటే ముందే బిల్ గేట్స్ అలాంటి మాస్క్ పేటెంట్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ప్రజలందరినీ వాళ్లు కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు కొన్ని సంవత్సరాల ముందే ప్లాన్ చేశారా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనే మెసేజ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
బిల్ గేట్స్ N95 మాస్క్ పేటెంట్ కోసం ప్రయత్నించాడన్న దానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. క్రిస్టోఫర్ హ్యారింగ్టన్ కూడా ఏదైనా మాస్క్ పేటెంట్ కోసం ప్రయత్నించాడని వెతకగా ఎటువంటి ఆధారం లభించలేదు.
ఈ వైరల్ అవుతున్న ఫోటో ‘ifunny’ అనే మీమ్స్ పేజ్ లోనిది.. ఈ పేజీలో ఎప్పటికప్పుడు మీమ్స్ ను పోస్ట్ చేసే వాడు. ఆ మీమ్స్ పేజీలో ఈ పోస్టును జులై 2020లో బ్రెట్ లాఫ్ గ్రీన్ అనే వ్యక్తి అప్లోడ్ చేశాడు. తానే కావాలనే ఈ పోస్టును తయారు చేశానని తెలిపాడు.. అది ఎందుకో కూడా తెలిపాడు.
నేను పోస్టు చేసిందంతా తప్పుడు సమాచారమే.. ఈ ఫోటోను గూగుల్ చేసి తీసుకున్నానని.. ఇందులో ఉన్న సమాచారం కూడా అబద్ధమే..! క్రిస్టోఫర్ హ్యారింగ్టన్ అనే పేరు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్ లో జాన్ స్నో క్యారెక్టర్ చేసిన వ్యక్తి పేరు. మీమ్స్ ని వార్తలుగా చూసే విధానం మార్చుకోవాలి అని కోరాడు. మీమ్స్ ద్వారా న్యూస్ ను చూసేసినట్లే అనుకుంటే పప్పులో కాలేసినట్లేనని తెలిపాడు.
N95 మాస్కులను ఎవరు కనుక్కున్నారని వెతకగా.. 'పీటర్ త్సాయ్' అనే వ్యక్తి కనుక్కున్నాడని తెలిసింది. 1995 లో ఫ్యాబ్రిక్ ను ఉపయోగించి N95 మాస్క్ ను తయారుచేశారు. యూనివర్సిటీ ఆఫ్ టెనెసీస్ లో ఆయన రీసెర్చర్ గా విధులు నిర్వర్తించి రెండేళ్ల కిందట రిటైర్డ్ అయ్యారు.
బిల్ గేట్స్ పేటెంట్ పొందిన వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని చూడొచ్చు. అందులో N95 మాస్క్ లేదు.
బిల్ గేట్స్ 2015 లోనే N95 మాస్క్ పేటెంట్ పొందారంటూ వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.. మీమ్స్ ను వార్తల కోసం చూడకూడదని ఓ వ్యక్తి ఇలాంటి పోస్ట్ ను తయారు చేశాడు.