Fact Check: నిజమెంత: ఒరిస్సాలో పసుపు రంగు తాబేలు కనిపించిందా..?

By సుభాష్  Published on  23 July 2020 3:39 AM GMT
Fact Check: నిజమెంత: ఒరిస్సాలో పసుపు రంగు తాబేలు కనిపించిందా..?

జులై 20, 2020న సుశాంత నంద అనే ఫారెస్ట్ ఆఫీసర్ తన సామాజిక మాధ్యమాల్లో పసుపు రంగు తాబేలుకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు. ఒడిశా లోని బాలాశోర్ లో పసుపు రంగు తాబేలు కనిపించిందని తెలిపాడు. అల్బినో తాబేలు అని చెప్పుకొచ్చాడు. కొన్ని సంవత్సరాల కిందట సింధ్ ప్రాంతంలో ఇలాంటి తాబేళ్లు కనిపించాయన్నాడు.

Odisha Paryavaran Sanrakshan Abhiyan – OPSA – Odisha కూడా తన ఫేస్ బుక్ పేజీలో కూడా పసుపు రంగు తాబేలు కనిపించిందని పోస్టు పెట్టారు. ఈ ఏడాది ఒడిశా తీరంలో తెలుపు, పసుపు రంగు తాబేళ్లు కనిపించాయి. జెనెటిక్ కారణాల వలన కానీ పిగ్మెంట్ ను కోల్పోవడం వలన కానీ రంగుల్లో మార్పు వచ్చాయని తెలిపారు. పరిశ్రమలు వెదజల్లే వ్యర్థాల వలన కూడా ఈ మార్పులు వచ్చే అవకాశం ఉందని పోస్టులో రాసుకుని వచ్చారు.

ఎంతో మంది సోషల్ మీడియా యూజర్లు ఇది నిజమేనని నమ్ముతున్నారు.

నిజ నిర్ధారణ:

ఒరిస్సాలో పసుపు రంగు తాబేలు కనిపించిందన్నది నిజం.

‘Yellow Turtle in Balasore, Odisha’ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయడమే కాకుండా, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం కూడా జరిగింది. అందుకు సంబంధించిన చాలా రిజల్ట్స్ కనిపించాయి. జులై 20, 2020న పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.



ఆదివారం నాడు బాలాసోర్ జిల్లాలోని సుజన్ పూర్ గ్రామస్థులకు ఈ పసుపు రంగు తాబేలు కనిపించింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి వారికి తాబేలును ఇచ్చారు. వన్య ప్రాణుల సంరక్షకుడు భానూమిత్ర ఆచార్య ఈ అరుదైన తాబేలుపై స్పందించారు. ఇలాంటి తాబేలును తాను ఇప్పటి వరకూ చూడలేదని అన్నారు. 'తాబేలు శరీరం, పైన ఉన్న గుల్ల మొత్తం పసుపు రంగులో ఉన్నాయని.. తాను ఇటువంటి తాబేలును ఇప్పటి వరకూ చూడలేదని' ఆచార్య అన్నారు.



సిఎన్ఎన్ రిపోర్టు ప్రకారం.. ఈ తాబేలు 'ఇండియన్ ఫ్లాప్ షెల్' జాతికి చెందినది తెలుస్తోంది. రెండున్నర సంవత్సరాల వయసు ఈ తాబేలుకు ఉంటుందని అన్నారు. ఆల్బినిజం(బొల్లి) కారణంగా తాబేలుకు ఆ రంగు వచ్చి ఉంటుందని అన్నారు.



Republic World, Hindustan times, NDTV వార్తా సంస్థలు ఈ అరుదైన జీవికి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించాయి.

పసుపు రంగు తాబేలు పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతంలో కనిపించినట్లు గతంలో వచ్చిన వార్తలు కూడా నిజమే. సెప్టెంబర్ 2016 లో పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతంలో ఈ అరుదైన తాబేలు కనిపించింది. Tribune.pk లో ఈ కథనాన్ని ప్రచురించారు.

ఒరిస్సాలో పసుపు రంగు తాబేలు కనిపించిందన్నది నిజమే..!

Next Story