వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన‌ టీడీపీ ఎమ్మెల్యే సాంబ‌శివ‌రావు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2020 7:18 AM GMT
వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన‌ టీడీపీ ఎమ్మెల్యే సాంబ‌శివ‌రావు

తెలుగుదేశం పార్టీని వీడుతున్నారంటూ వచ్చిన వార్తలను ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కావాలనే కొంద‌రు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్ టీడీపీనే

ఇచ్చిందన్న ఆయన.. ఏ పార్టీకి చెందిన వ్యక్తులతోనూ తాను సంప్రదింపులు జరపలేదన్నారు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధికి కృషి చేశాన‌న్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా రాజకీయ నేతగా కన్నా తమ కుటుంబ సభ్యునిగానే చూశార‌ని తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపనులు వాళ్లు చేసుకుంటారనే ఉద్దేశంతోనే కొన్ని కార్యక్రమాలకు తాను దూరంగా ఉన్నట్టు ఆయన వివరించారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా వచ్చిన వార్తలు ఖండిస్తున్నాన్నని, ఇలాంటి వార్తలకు ఇకనైనా పుల్‌స్టాప్ పెట్టాలని కోరారు.

గ‌త కొద్దిరోజులుగా వైసీపీ పార్టీలోకి కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు చేర‌నున్నారు అనే వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేరు కూడా వినిపించింది. మొత్తానికి నాకు తెలుగు దేశం పార్టీని వీడే ఆలోచన లేదని, టీడీపీలోనే కొన‌సాగుతాన‌ని సాంబ‌శివ‌రావు క్లారిటీ ఇచ్చారు.

Next Story