అమ్మానాన్నలకు తెలియకుండా నిశ్చితార్థం కానిచ్చేసిన హార్దిక్ పాండ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 12:48 PM GMT
అమ్మానాన్నలకు తెలియకుండా నిశ్చితార్థం కానిచ్చేసిన హార్దిక్ పాండ్య

క్రికెటర్లు, సినిమా స్టార్లు ప్రేమలో పడటం, ప్రేమించిన వారితో జీవితం పంచుకోవడం సర్వసాధారణం.ఇపుడు మనం భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గురించి మాట్లాడుకుందాం! ఐపీఎల్ లో ఒక వెలుగు వెలిగి కొద్ది కాలంలోనే భారత క్రికెట్ జట్టు తలుపు తట్టిన ఆల్ రౌండర్ మన హార్దిక్ పాండ్య. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న పాండ్య 2015 లో చెన్నై జట్టు మీద ఆడిన ఒక మెరుపు ఇన్నింగ్స్ తో స్టార్ అయిపోయాడు. భారత జట్టుకు విలువైన ఆల్ రౌండర్ గా గుర్తింపబడ్డాడు.

ఇక హార్దిక్ వ్యక్తిగత జీవితం కూడా ఈ మధ్య బాగా పాపులర్ అయింది. అతడు అభిమానులతో ఒక శుభ వార్తను పంచుకున్నాడు. నేను,నటాషా త్వరలోనే ఒక బేబీ ని అందుకోబోతున్నాం అని తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటో ను పోస్ట్ చేసాడు. హార్దిక్, నటాషా ల నిశ్చితార్థం జనవరి 1 వ తేదీన జరిగింది. ఈ విషయం హార్దిక్ పేరెంట్స్ కు తెలియకుండానే జరిగిందట. హార్దిక్ పాండ్యా ఈ విషయాన్ని "క్రిక్ బజ్" లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

అమ్మానాన్నలకు తెలియకుండా మా నిశ్చితార్థం జరిగిందని.. కృనాల్ కి రెండు రోజుల ముందే చెప్పానని తెలిపాడు. నటాషా నా జీవిత భాగస్వామిగా రావడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపాడు. హార్దిక్ పాండ్య గాయం కారణంగా భారత జట్టుకు కొద్ది కాలంగా దూరం అయ్యాడు. ఇంగ్లాండ్ లో శస్త్ర చికిత్స చేయించుకొన్నాడు. ఈ మధ్య ముంబై దేశవాళీ టి20 మ్యాచ్ ల్లో హార్దిక్ తన మునుపటి సత్తా చాటాడు. ఐపీఎల్ లో పాండ్యా బ్రదర్స్ మెరుపులు చూడాలని అందరూ ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో ఐపీఎల్ వాయిదా పడింది. ఇంతలోనే పాండ్యా తాను తండ్రి కాబోతున్నాను అని గుడ్ న్యూస్ చెప్పాడు. అన్నట్టు మన హార్దిక్ కి నటాషా కి ఇంకా పెళ్లి కాలేదు ఇదొక కొసమెరుపు.

Next Story
Share it