Fact Check : పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి పాకిస్థాన్ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Sep 2020 10:28 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే 49వ పుట్టినరోజును జరుపుకున్నారు. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు రాజకీయ నేతలు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా జనసేనానికి బర్త్ డే విషెష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ లో వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఏకంగా పాకిస్థాన్ కు చెందిన వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వచ్చాయి. పాకిస్థానీ వెబ్సైట్ ను భారత్ కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారని.. అందులో పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెష్ చెప్తూ ఉండడం గమనించవచ్చు.
Green Stacks అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా పాకిస్థాన్ కు చెందిన వెబ్సైట్ హ్యాక్ అయిన వీడియోను పోస్టు చేశారు. పాకిస్థాన్ వెబ్సైట్ ను భారత్ కు చెందిన సైబర్ ట్రూప్స్ హ్యాక్ చేశాయి.. లెజెండరీ నటుడు పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పాకిస్థాన్ కు చెందిన వెబ్ సైట్స్ ను హ్యాక్ చేయడం 'నిజమే'.
యూట్యూబ్ వీడియోను చూడగా.. ఈ పని వెనుక ఉన్నది Indian Cyber Troops అన్నది తెలుస్తోంది. న్యూస్ మీటర్ ఈ సంస్థకు సంబంధించిన ఫేస్ బుక్ పేజీని పరిశీలించగా 28000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ హ్యాక్ చేసిన పాకిస్థాన్ వెబ్ సైట్స్ స్క్రీన్ షాట్లు చూడొచ్చు.
“http://ptf.sp.edu.pk/
http://course.sp.edu.pk/index.php
http://abcxyez.sp.edu.pk/
http://lmstemplate.sp.edu.pk/
http://beta.sp.edu.pk/
http://courier.com.bd/
Attacker: B45U” అంటూ హ్యాక్ చేసిన వెబ్సైట్ల లింక్ లు చూడొచ్చు.
తాము భారత్ కు చెందిన సైబర్ యాక్టివిస్టులమంటూ తమ పేజీలో చెప్పుకొచ్చారు.
https://sp.edu.pk/ అన్నది పాకిస్థాన్ కు చెందిన ఎడ్యుకేషన్ వెబ్సైట్. పాకిస్థాన్ కు చెందిన ఎన్నో స్టార్టప్ కంపెనీలకు సహాయం చేశామని అందులో చెప్పుకొచ్చారు. అందులో వారి పాకిస్థాన్ కు సంబంధించిన అడ్రెస్ ను కూడా చూడొచ్చు.
�
భారత స్వాతంత్య్రదినోత్సవం నాడు పాకిస్థాన్ కు చెందిన 80కి పైగా వెబ్సైట్లను భారత్ కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారు. త్రివర్ణ పతాకాన్ని పేజీ మధ్యలో చూపించారు. పాకిస్థాన్ కు చెందిన మరికొన్ని వెబ్సైట్లను హ్యాక్ చేసి.. రామ మందిరాన్ని పాకిస్థాన్ లోనూ కరాచీ లోనూ కడతామంటూ ఆ వెబ్సైట్లలో పోస్టు చేశారు.
‘Indian Cyber Troops’ పాకిస్థాన్ కు చెందిన వెబ్సైట్లను గతంలో చాలా సార్లు హ్యాక్ చేశారు. నేపాల్ కు చెందిన వెబ్సైట్లను కూడా వారు హ్యాక్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు పాకిస్థాన్ కు చెందిన వెబ్సైట్లను హ్యాక్ చేసి.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం 'నిజం'.