జమ్మూకశ్మీర్‌: పాకిస్తాన్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కుప్వారా జిల్లాలోని టాంఘర్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. పాక్‌ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు, పౌరుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడమే లక్ష్యంగా పాక్‌ కాల్పులు జరిపిందని తెలుస్తోంది. అయితే ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడకుండా మట్టుబెడుతోంది. పాక్‌ కాల్పుల్లో ఇల్లు, రైస్‌ మిల్లు, రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story