పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ
By సుభాష్ Published on 6 Jun 2020 3:01 PM ISTపాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాక్ కోర్టు శనివారం ఇమ్రాన్‌ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు పీఎంఎల్-ఎన్ పార్టీ అధ్యక్షుడు షహ్‌బాజ్ షరీఫ్ 2017లో వేసిన పరువు నష్టం దావా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఈ నోటీసులు అందాయి. ఇమ్రాన్ ఖాన్ ఓ సభలో మాట్లాడుతూ.. పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకున్న నవాజ్‌పై నమోదు చేసిన కేసునును వెనక్కి తీసుకోవాలని కోరుతూ షహ్‌బాజ్ తన 61 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. అయితే అవన్నీ అబద్దాలేనని చెబుతూ షహ్‌బాజ్ కోర్టును ఆశ్రయించారు. ఇది చదవండి: కొడుకు ముందు భార్యపైనే స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం
దీనిపై ఇప్పటికే 60 సార్లు విదనలు వినగా, ఇమ్రాన్‌ఖాన్ 33 సార్లు వాయిదా కోరారు. పలు మార్లు న్యాయవాదుల ద్వారా కోర్టుకు తన వాదన వినిపించారు. కానీ ఇప్పటి వరకు ఆయన రాత పూర్వకంగా సమాధానం చెప్పింది ఏనాడులేదు. దీంతో ఈసారి తప్పకుండా కోర్టుకు రాత పూర్వకంగా సమాధానం చెప్పాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పీఎంఎల్ - పాన్ పార్టీ స్పోక్‌పర్సన్ మరియం మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ సమాధానం ఇవ్వని పక్షంలో ఆర్టికల్ 62, 63 ప్రకారం ప్రధాని పదవికి అనర్హుడు అవుతాడని వెల్లడించారు. ఇది చదవండి: పెద్దన్న ఇలాఖాలో ఆగ్రహజ్వాలలు
కాగా, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్ ఆనారోగ్యం కారణంగా లండన్‌లో చికిత్స పొందుతున్నారు. 2017లో పనామా పేపర్స్ కేసులో సుప్రీం కోర్టు అతన్ని అనర్హుడుగా ప్రకటించింది. అంతేకాదు షరీఫ్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై సైతం అవినీతినిరోధక కేసులు నమోదలయ్యాయి.