పెద్దన్న ఇలాఖాలో ఆగ్రహజ్వాలలు

By సుభాష్  Published on  1 Jun 2020 12:17 PM GMT
పెద్దన్న ఇలాఖాలో ఆగ్రహజ్వాలలు

అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఆదివారం దేశంలోని మరిన్ని రాష్ట్రాలు, నగరాలకు హింసాకాండ చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు తోడుగా నేషనల్‌ గార్డ్స్‌ కూడా రంగంలో దిగినప్పటికీ ఆందోళన ఏ మాత్రం ఆగడం లేదు. వేలాది మంది నిరసన కారులు రోడ్లు, పబ్లిక్‌ పార్కుల్లో భారీ ఎత్తున గుమిగూడి న్యాయం కావాలంటే ఆందోళన ఉధృతం చేశారు. 'నాకు ఊపిరి ఆగడం లేదు మీ చర్యలతో మమేం విసిగిపోయాం' అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తాయి. ఇలాంటి జరుగుతున్న అల్లర్లను సైతం అదుపు చేసేందుకు న్యూయార్క్‌, పోలీసులు రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించాయి.

అసలేం జరిగింది

కాగా, నల్లజాతి యువకుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే యువకుడు గత సోమవారం తెల్లజాతి పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ప్లాయిడ్‌ మరణించే ముందు చివరి 30 నిమిషాల పాటు అనేక ఇబ్బందులకు గురయ్యాడు. కానీ, పోలీసులు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మొదలైన నిరసనలు ఆదివారం దేశ అధ్యక్షుడు భవనం హౌట్‌ హౌస్ కు తాకాయి. ఆందోళనకారులు దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌ హౌస్‌ గేటు వద్ద డస్ట్‌ బిన్‌కు నిప్పటించారు.

ఇక పరిస్థితిని అదుపు చేసేందుకు నగరంలో పదివేల మంది నేషనల్‌ గార్డ్స్‌ ను రంగంలోకి దించారు. ఫిలడేల్సియాలో ఆదివారం న్యూయార్క్‌, అట్లాంటా, డెనోవర్‌, లాస్‌ ఎంజిల్స్‌, మిన్నె పోలీస్‌, ఆన్‌ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌ వంటి నగరాల్లో రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ విధించారు. 2014లో కూడా పోలీసుల చర్య వల్ల ఎరిక్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. పొగాకు ఉత్పత్తులను అధికంగా అమ్ముతున్నాడనే ఆరోపణలో అతడిని పోలీసులు దారుణంగా కొట్టి చంపేశారు. అప్పట్టో పెద్ద ఎత్తున రగడ మొదలైంది. ఇప్పుడు అదే తరహాలో మరో వ్యక్తిని చంపేయడం తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.

1669 మంది నిరసన కారుల అరెస్ట్‌

22 నగరాల్లో గురువారం నుంచి ఇప్పటి వరకూ 1669 మంది నిరసన కారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక వైపు దేశ మంతా భగ్గుమంటున్నా.. అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం శనివారం ప్లోరిడాలో స్పేస్‌ ఎక్స్‌ రాకేట్‌ ప్రయోగాన్ని తిలకించడంలోనే గడిపారు.

హింసాత్మకంగా మారిన నిరసనలు

కాగా, అమెరికాలో నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. చాలా ప్రాంతాల్లో వేలాది మంది శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు. వాషిగ్టన్‌ డీసీలో దాదాపు 1000 మంది నల్లజాతీయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల హింసకు అద్దు అదుపు లేకుండా పోయింది. పోలీసుల దాష్టీకానికి అంతేలేకుండా పోయిందని నిరసనలో పాల్గొన్న ఓల్గాహాల్‌ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు పదేపదే ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడింది.

అలాగే న్యూయాస్క్‌లోని బ్రూక్లిన్‌లో ఆదివారం నిరసనకారులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. రోడ్డును దిగ్బంధించి వందలాది మంది నిరసనలు తెలియజేస్తుండగా సమీపంలోని ట్రాఫిక్‌ సిగ్నల్ వద్ద ఆగివున్న ట్రక్కు వారిపై ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఇక నిరసన కారులు డ్రైవర్‌ ఆవేశంతో ఈ చర్యకు పాల్పడినట్లు అక్కడి సీసీ టీవీ పుటేజీలో కనిపించింది. దాడిలో చాలా మంది నిరసన కారులు గాయడపడ్డారు.

జార్జ్‌ ప్లాయిడ్‌ హత్యకు ఒబామా తీవ్ర భావోద్వేగం

కాగా, జార్జ్‌ ప్లాయిడ్‌ దారుణ హత్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శనివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఒబామా.. ప్లాయిడ్‌ హత్య వీడియో చూసి నాకు ఏడుపు ఆగలేదు, సహాయం కోసం అరుస్తున్నా.. ఎవరు కూడా పట్టించుకోలేదు. ఉపరాడకుండా మెడపై మోకాలితో నొక్కిపెట్టడం వల్ల నల్లజాతీయుల పట్ల మన వ్యవస్థ తీరుకు నిదర్శనం అని అన్నారు.

Next Story