ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి కరోనా నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఆయా దేశాలు తమ సరిహద్దులను మూసివేసుకున్నాయి. ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడి నిలిపివేశాయి.

అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఎయిర్‌ఇండియా విమానం ముంబై నుంచి యూరప్‌ దేశాలకు రెండు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌ఇండియా విమానం పాక్‌ గగన తలం చేరుకోగానే ఆస్తకికర విషయం చోటు చేసుకుంది.

ముంబై నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరిన విమానం.. పాకిస్తాన్‌ దేశం గగనతలం చేరుకోగానే.. పాక్‌ విమాన అధికారులు స్పందించారు. నమస్కారం.. ఫ్రాంక్‌ఫర్ట్‌కు విమానసర్వీసు నడుపుతున్న ఎయిర్‌ఇండియాకు స్వాగతం అన్ని అన్నారని ఎయిర్‌ఇండియా ఫైలట్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల్లోనూ విమనాలను నడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పాకిస్తాన్‌ అధికారులు పేర్కొన్నట్టు పైలట్‌ చెప్పారు. అలాగే పాక్‌ కేబూద్‌ ఎగ్జిట్‌ పాయింట్‌ నుంచి ఇరాన్‌లోకి వెళ్లడానికి వెంటనే అనుమతి ఇచ్చిందన్నారు.

ఇదే సమయంలో ఇరాన్‌ రాడార్ల సమాచారం అందడం లేదని ఫైలట్‌లు పాకిస్తాన్‌ అధికారులను కోరగా.. వారు వెంటనే స్పందించినట్లు సమాచారం. టెహ్రాన్‌కు ఎయిర్‌ఇండియా విమానాలు ఇరాన్‌లోకి ప్రవేశిస్తున్నాయని పాక్‌ అధికారులు సమాచారం అందించారు. దీంతో ఇరాన్‌ దేశం కూడా ఆ దేశ విమాన మార్గంలో 1000 కిలోమీటర్ల మేర ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చిందని ఎయిర్‌ ఇండియా ఫైలట్‌ తెలిపారు. ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో అన్ని దేశాల విమానశాఖలు పరస్పరం సహకరించుకోవడం మంచి పరిణామం అని ఫైలట్‌ అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.