తామూ పాల్గొంటాం .. మోదీ పిలుపుకు పాక్ స్పందన
By Newsmeter.Network
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకు మరింత విజృంభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ భారిన పడి నాలుగువేల మందికి పైగా మృతిచెందగా.. లక్షన్నర మంది కరోనా భారిన పడి చికిత్స పొందుతున్నారు. మరోవైపు భారత్ దేశంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీంతో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే 84మందికి పైగా ఈ వైరస్ భారిన పడి మృతిచెందగా, వేలాది మంది ఈ వైరస్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.
also read : దాడులకు భయపడొద్దు.. భయపడితే అలానే ఉండిపోతాం : పవన్
దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్‌లోనూ పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారిపై ఉమ్మడిగా పోరాడుదామని సార్క్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు బలమైన వ్యూహాన్ని రచించేందుకు వీడియో కాన్ఫరెన్సై్ ద్వారా చర్చిద్దామని భాగస్వామ్య దేశాధినేతలందరిని ప్రధాని మోదీ కోరారు.
మోదీ పిలుపునకు పాకిస్థానం సానుకూలంగా స్పందించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో తాముకూడా పాల్గోనున్నట్లు పాక్ ప్రధాని హెల్త్ అసిస్టెంట్ జాఫర్ మీర్జా తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పాక్‌లో ప్రచారం జాఫర్ మీర్జా నేతృత్వంలో కొనసాగుతోంది. కోవిడ్ -19వ్యాధితో భారత్‌లో ఇద్దరు మరణించగా పాక్‌లో ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. పాక్‌లో కరోనా కేసులు 28 నమోదయ్యాయి.