గుజరాత్‌ సరిహద్దుల్లో కుప్పకూలిన పాక్‌ ఎయిర్‌క్రాప్ట్‌

By సుభాష్  Published on  13 April 2020 5:00 PM IST
గుజరాత్‌ సరిహద్దుల్లో కుప్పకూలిన పాక్‌ ఎయిర్‌క్రాప్ట్‌

పాకిస్థాన్ కు చెందిన ఎయిర్‌క్రాప్ట్‌ గుజరాత్‌ రాష్ట్ర సరిహద్దుల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు పైలట్లు మృతి చెందారు. పాక్‌డే పరేడ్‌ రిహార్సల్‌లో భాగంగా బయలుదేరిన ముష్షాక్‌ టైనర్‌ ఎయిర్‌ క్రాప్ట్‌ విమానం కొద్దిసేపటికే పాకిస్థాన్‌ - గుజరాత్‌ సరిహద్దు ప్రాంతంలో కుప్పలికూపోయిందని ఆర్మీకి చెందిన మీడియా వింగ్‌, ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ తెలిపింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు పాక్‌ పైలట్లు మేజర్‌ ఉమేర్‌ ఇన్‌స్టక్టర్‌ పైలట్‌, లెప్టినెంట్‌ ఫైజన్‌లు మృతి చెందినట్లు వెల్లడించింది. కాగా, గత నెల మార్చి 23న ఎఫ్‌-16కూడా కుప్పలికూపోయింది. ఈ ఘటనలో కూడా కమాండర్‌ నౌమాన్‌ అక్రమ్‌ మృతి చెందాడు. ఇలా వరుస ప్రమాదాలు జరగడంతో పాకిస్థాన్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.



Next Story