ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌: భారత్‌లో ఐదు చోట్ల క్లినిక‌ల్‌ ట్రయల్స్‌

By సుభాష్  Published on  28 July 2020 5:34 AM GMT
ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌:  భారత్‌లో ఐదు చోట్ల క్లినిక‌ల్‌ ట్రయల్స్‌

ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెన్‌కా కోవిడ్‌19 వ్యాక్సిన్ కోసం భార‌త్‌లో ఐదు చోట్ల తుది, మూడ‌వ ట్ర‌య‌ల్స్ నిర్వహిస్తోంది. బ‌యోటెక్నాల‌జీ సంస్థ సెక్ర‌ట‌రీ రేణు స్వ‌రూప్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. భార‌త్‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాను వాడ‌కంలో తీసుకురావడానికి ముందు ఆ టీకాను ఇక్క‌డే ప‌రీక్షించ‌డం అత్యంత ముఖ్య‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. భార‌త్‌కు చెందిన సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేయ‌నుంది. తొలి రెండు ద‌శ‌ల‌కు ట్ర‌య‌ల్స్ నివేదిక‌ల‌ను ఇప్ప‌టికే ప‌బ్లిష్ చేశారు.

భార‌త్‌లో ఎటువంటి కోవిడ్ 19 వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు జ‌రిగినా.. దాంట్లో డీబీటీ భాగ‌స్వామ్యం ఉంటుంద‌ని స్వ‌రూప్ తెలిపారు. ఫండింగ‌గ్‌, రెగ్యూలేట‌రీ క్లియ‌రెన్స్ లు, విభిన్న‌నెట్‌వ‌ర్క్ ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం వంటి అంశాలు బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్ మెంట్ కింద‌కు వ‌స్తాయ‌న్నారు. అయితే ఆక్స్ ఫ‌ర్డ్ మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కోసం సైట్ల‌ను ఖ‌రాఉచేసే ప‌నిలో డీబీటీ ఉన్న‌ట్లు ఆమె వెల్లడించారు. ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఐదు సైట్లు అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు.

అయితే త్వరగా క్లినికల్‌ ట్రయల్స్‌ ముగించాలని శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య 15 మిలియన్లు దాటిపోయింది. మరణాలు ఆరు లక్షలను దాటిపోయాయి. డజన్ల కొద్దీ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో పరీక్షలు రెండో దశలో ట్రయల్స్‌ మొదలు పెట్టాయి. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ వస్తుందని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక భారత్ కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో మ‌రింత ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. క‌రోనా క‌ట్ట‌డికి కేంద్ర‌, ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా.. ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. నిన్న ఒక్క రోజే దేశంలో 49,931 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 708 మంది మృతి చెంద‌డం తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌ర‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 14,35,453కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 9,17,568 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,85,114 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక మొత్తం క‌రోనా బారిన 32వేల‌కు పైగా మృతి చెందారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ త‌ర్వాత భార‌త్ మూడో స్థానంలో ఉంది. ఇక అత్య‌ధిక మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్న దేశాల్లో భార‌త్ ఆరో స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. మున్ముందు మ‌రిన్ని మ‌ర‌ణాలు సంభ‌వించి ముందు స్థానంలోకి వెళ్ల‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌రోనాకు ఎలాంటి వ్యాక్సిన్ రానందున ఎవ‌రికి వారే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని సూచిస్తున్నారు. జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే మ‌రింత ప్ర‌మాదం పొంచివుండే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. కొంద‌రు మాస్క్ లు ధ‌రించ‌క‌పోవ‌డం, భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డం కార‌ణంగా కూడా క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతోంద‌ని పేర్కొంటున్నారు.

Next Story
Share it