ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకిస్తున్న దోశదోహ్రులను తుపాకీతో కాల్చివేయాలంటూ అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

ధైర్మముంటే తనను కాల్చి వేయాలని ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఠాకూర్‌ ఎక్కడికి రమ్మన్నా వస్తానని, అక్కడ నన్ను కాల్చివేయవచ్చని ఓవైసీ సవాల్‌ విసిరారు. అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలకు సీఏఏ, ఎన్‌ఆర్సీని వ్యతిరేకించే వారు భయపడడం లేదన్నారు. దేశంలోని ఎదో ఒక్క ప్రాంతం చెప్పాలని, అక్కడి తాను వస్తానని అసదుద్దీన్‌ అన్నారు. అక్కడ షూటు చేయండని అన్నారు.

మీ ప్రకటనలకు తాము భయపడడం లేదన్న ఆయన.. తమ తల్లులు, సోదరులు ఎంతో మంది రోడ్లపైకి వచ్చారని అసదుద్దీన్‌ అన్నారు. రిథాలా నియోజకవర్గంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ సోమవారం ప్రచారం నిర్వహించారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలకు మద్దతుగా నినాదాలు చేశారు. సీఏఏ వ్యతిరేకించేవారిని ఆయన దోశద్రోహులుగా పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం బీజేపీ నేత కపిల్‌ మిశ్రా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అతనికి ఈసీ షోకాజు నోటీసు జారీ చేసింది. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలకు కొందరు మద్దతు పలుకుతున్నారు. అందులో తప్పేముందంటూ కవర్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా దేశంలోని పలు చోట్ల ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు సీఏఏ నిరసనల్లో 20 మందికిపైగా చనిపోయారు. విపక్షాలు, ప్రజాసంఘాలు సైతం తమ ఎన్‌ఆర్సీని, సీఏఏని వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.