హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఓయే విద్యార్దులు రంగంలోకి దిగారు. 19న బంద్‌ను విజయవంతం చేయడానికి రోజువారి కార్యకలాపాల్లో పాల్గొంటామని విద్యార్ధి నేతలు చెప్పారు. వంటా – వార్పు కార్యక్రమంలో దాదాపు 500 మంది విద్యార్ధులు పాల్గొన్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తాము ఉద్యమిస్తామన్నారు. కేసీఆర్‌కు గుణపాఠం చెబుతామని ఓయూ విద్యార్ధులు అన్నారు. కార్మికుల జీవితాలతో సీఎం కేసీఆర్‌ ఆడుకుంటున్నారని విద్యార్ధులు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం పోరాడటంలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి..ఆస్తులను కాపాడటానికి ఉద్యమిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ కుట్ర పూరితంగానే విద్యార్ధుల సెలవులు పొడిగించారని తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా కేసీఆర్ వ్యవహరించడంలేదన్నారు. చర్చలు ద్వారా సమస్యను పరిష్కరించకుండా..అణగదొక్కాలని చూస్తున్నారని ఓయూ విద్యార్ధి నేతలు మండిపడ్డారు.

25 విద్యార్ధి సంఘాలను జేఏసీగా ఏర్పాటు చేసి ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తాం- OU స్టూడెంట్స్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉస్మానియా విద్యార్దుల త్యాగం మరువలేనిది. తెలంగాణ ప్రగతి చక్రం..ఆర్టీసీ రథ చక్రం. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి సీఎం కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారు. నెల రోజులు ముందుగానే సమ్మె నోటీస్‌ ఇస్తే..కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు. ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ఉస్మానియా విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి. 25 విద్యార్ధి సంఘాలను జేఏసీగా ఏర్పాటు చేసి ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తాం. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వంటా – వార్పు చేపట్టాం. మంత్రి పువ్వాడ అజయ్‌ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని విద్యార్దులు ప్రశ్నించారు. ఉద్యమం ఇచ్చిన పదవిని పువ్వాడ అజయ్ కుమార్ అనుభవిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమంటే..ప్రజలే మిమ్మల్ని డిస్మిస్‌ చేస్తారని విద్యార్ది నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్త విద్యార్ధి ఉద్యమాన్ని కూడా చేపడతామన్నారు ఓయూ నేతలు.

ఇది కూడా చదవండి:

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ మద్దతు

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.