లాక్‌డౌన్‌లో ఇదేం క‌క్కుర్తి.. హైద‌రాబాద్‌లో మ‌రీనూ..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2020 3:09 PM IST
లాక్‌డౌన్‌లో ఇదేం క‌క్కుర్తి.. హైద‌రాబాద్‌లో మ‌రీనూ..!

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డానికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ను విధించారు. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. బ‌య‌టికి వెళ్ల‌డానికి వీలులేని ప‌రిస్థితులు ఉండ‌డంతో.. త‌మ‌కు కావాల్సిన ఆహారాన్ని ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకుంటున్నారు. దీంతో ఆన్‌లైన్ డెలివ‌రీ యాప్స్ కి పుల్ డిమాండ్ ఏర్ప‌డింది. ఇక డుంజో యాప్ లో కిరాణ సామాగ్రి నుంచి ఆహారం వ‌ర‌కు అన్ని అందుబాటులో ఉన్నాయి. లాక్‌డౌన్ కాలంలో త‌మ యాప్ నుంచి ఎక్కువ‌గా డెలివ‌రీ చేసిన వాటి వివ‌రాల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

మార్చి 1 నుంచి 31 వ‌ర‌కు బెంగ‌ళూరు, పూణె, చెన్నై, జైపూర్‌, ముంబై, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో తాము డెలీవ‌రి చేసిన వాటి గురించి తెలిపింది. చెన్నై, జైపూర్‌వాసులు ఎక్కువ‌గా హ్యాండ్‌వాష్‌ను ఆర్డ‌ర్ చేశారు. ప్ర‌స్తుతం క‌రోనా ముప్పుతో వీటికి య‌మా డిమాండ్ పెరిగింది. బెంగ‌ళూరు, పుణె న‌గ‌రాల్లో ప్రెగ్నెన్సీ కిట్ల‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేయ‌గా.. ముంబైవాసులు మాత్రం.. కండోమ్స్ ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశార‌ట‌. ఇక హైద‌రాబాద్ వాసులు కూడా తాము ముంబైకి ఏమాత్రం త‌క్కువ కాదంటూ ఐ-పిల్‌ను(గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు) ఆర్డ‌ర్ చేశారు.

దీనిపై సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఇదేం క‌క్కుర్తి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.



Next Story