వీడెవ‌డండీ బాబూ.. ఏటీఎం వెళ్లి శానిటైజర్ కొట్టేశాడు.. వీడియో వైర‌ల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2020 3:35 PM GMT
వీడెవ‌డండీ బాబూ.. ఏటీఎం వెళ్లి శానిటైజర్ కొట్టేశాడు.. వీడియో వైర‌ల్‌

దొంగ‌ల్లో కొంద‌రు వెరైటీ దొంగ‌లు ఉంటారా..? అంటే ఈ ఘ‌ట‌న చూస్తే అవున‌నే అనిపింస్తుంది. ఏటీఎంకి వెళ్లి డబ్బులు చోరీ చేసే దొంగ‌ల‌ను చూశాం.. కానీ పాకిస్థాన్‌లో ఓ యువ‌కుడు చోసిన పని చూస్తే న‌వ్వాలో ఏడ్వాలో అర్థం కాని త‌ల‌ప‌ట్టుకుంటారు. ఇంత‌కీ అత‌ను ఏటీఎంకి వెళ్లి ఏం చోరీ చేశాడో తెలుసా..? శానిటైజ‌ర్‌.

అంత ధ‌ర ఎందుకు అని అనుకున్నాడో ఏమో..?

వివ‌రాల్లోకి వెళితే.. పాకిస్తాన్ లోని పెషావర్ లో నమక్ మండీ ప్రాంతంలోని ఓ ఎటీఎంకు యువ‌కుడు వ‌చ్చాడు. ఏటీఎంలోకి వ‌చ్చిన వెంట‌నే అక్క‌డ ఉన్న శానిటైజ‌ర్ బాటిల్ తీసుకున్నాడు. కొంత శానిటైజ‌ర్‌ను చేతుల‌కు పూసుకుని చేతుల‌ను శుభ్రం చేసుకున్నాడు. ఆ త‌రువాత ఏటీఎంలోంచి డ‌బ్బుల‌ను డ్రా చేశాడు. ఆ త‌రువాత ఏమ‌నుకున్నాడో ఏమో కానీ.. ప‌క్క‌నే ఉన్న శానిటైజ‌ర్ బాటిల్‌ను త‌న చొక్కాలో పెట్టుకుని వెళ్లిపోయాడు. ఈ త‌తంగం అంతా అక్క‌డ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్న విషయం అతడికి తెలుసో లేదో, లేక తెలిసి చేశాడో కానీ.. బాటిల్ ను మాత్రం ఎత్తుకెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌కు చెందిన నైలా ఇనయాత్‌ అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన నెటీజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ‘ఏటీఎంకి వచ్చి డబ్బు చోరీ చేసిన వాళ్లను చూశాము. కానీ.. శానిటైజర్‌ బాటిల్‌ను దొంగతనం చేయడం ఇప్పుడే చూస్తున్నా’ అని ఓ నెజ‌టీన్ కామెంట్ చేయ‌గా.. ఛీ,ఛీ..మరీ ఇంత కక్కుర్తా? వీడెవండి బాబూ? అంటూ మ‌రొనెటీజ‌న్ కామెంట్ చేశాడు.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా శానిటైజ‌ర్లు, మాస్కుల‌ను మ‌యా గిరాకీ పెరిగింది. దీంతో వీటి ధ‌ర‌లు ఆకాశాన్ని తాకాయి. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా శానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలామంది.. అధిక ధరలు ఉన్నప్పటికీ శానిటైజర్లను కొనుగోలు చేస్తున్నారు.Next Story