ఇన్‌స్టంట్‌లో రుణాలు.. ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో అప్పులు.. పక్కదారిలో యువత

By అంజి  Published on  20 Feb 2020 7:25 AM GMT
ఇన్‌స్టంట్‌లో రుణాలు.. ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో అప్పులు.. పక్కదారిలో యువత

హైదరాబాద్‌: యుతతరాన్ని ఆన్‌లైన్‌ గేమ్‌లు పెడదోవ పట్టిస్తున్నాయి. కొత్త వ్యసనాలకు బానిసలై విద్యార్థులు చితికిపోతున్నారు. పేయిడ్‌గేమ్‌లకు తోడుగా ఇన్‌స్టంట్‌ రుణాల యాప్‌లు.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి. హైదరాబాద్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి అదృశ్యం కేసుల్లో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్‌స్టంట్‌ యాప్‌లో రుణాలు తీసుకొని యువత.. ఆన్‌లైన్‌ గేముల్లో బెట్టింగ్‌లు పెడుతున్నాయి. అయితే తాజా విద్యార్థి అదృశ్యం కేసుతో ఈ విషయాలు మరింత వెలుగులోకి వచ్చాయి.

మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో జీవన్‌రెడ్డి అనే విద్యార్థి బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. కాలేజీ సమీపంలోని హరిహర బాయ్స్‌ హాస్ట్‌లో ఉంటున్న జీవన్‌రెడ్డి వారం క్రితం అదృశ్యమయ్యాడు. విద్యార్థి జీవన్‌ రెడ్డి కనిపించడం లేదని 11వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులకు హాస్టల్‌ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థి తండ్రి పెట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హాస్టల్‌లోని జీవన్‌రెడ్డి గదిలో రక్తం మరకలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు. బ్లెడ్‌తో పాటు అతని బట్టలపై రక్తం మరకలు ఉన్నాయి. హాస్టల్‌ నుండి బయటకు వెళ్లేముందు జీవన్‌ తొటి రూమ్స్‌మెట్స్‌తో గొడవకు దిగాడాని తెలుస్తోంది. కాగా మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విద్యార్థికి క్రికెట్‌ అంటే ప్రాణమని, దాని కోసం తరగతులకు కుడా బంక్‌ కొట్టేవాడని తెలిసింది. క్రికెట్‌ మ్యాచ్‌లను చివరి వరకు వీక్షించేవాడని తెలిసింది. ఫిబ్రవరి 11న ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య మూడో వన్డే మ్యాచ్‌ జరిగింది. ఆ సమయంలో అతడు కాలేజీ క్యాంటిన్‌లో మ్యాచ్‌ చూశాడు. ఆ తర్వాత కాలేజీలోనే చివరిసారిగా అతని ఫోన్‌ స్విఛ్‌ ఆఫ్‌ అయ్యింది. దీంతో ఫోన్‌ నెంబర్‌ ద్వారా పోలీసులు మరింత లోతుగా విశ్లేషించారు. ఆ విద్యార్థి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో పాటు పెయిడ్‌గేమ్‌ల కోసం డబ్బులు వెచ్చించినట్లు పోలీసులకు తెలిసింది. ఇన్‌స్టంట్‌ యాప్‌ల నుంచి రుణాలు పొందేంతుకు ఆ విద్యార్థి తన తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లు, ఆధార్‌కార్డును ష్యూరిటీగా ఇచ్చాడు. గడువులోగా డబ్బులు చెల్లించకపోవడంతో ఇటీవల ఆ రుణాల యాప్‌ల నుంచి విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అయితే ఇంట్లో తెలిసిపోయిందని, తనని మందలిస్తారన్న భయంతోనే అతడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆన్‌లైన్‌ పేయిడ్‌ గేమ్‌లకు చాలా మంది యువత అలవాటు పడ్డారని పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది. ఇన్‌స్టంట్‌ యాప్‌లో రుణాలు తీసుకొని ఆన్‌లైన్‌ గేమ్స్‌లో బెట్టింగ్‌లు పెడుతున్నారని తెలిసింది. అయితే వేల రూపాయలను బెట్టింగ్‌లో పెడుతూ.. చివరి డబ్బులు రాకపోయేసరికి బోక్క బోర్ల పడుతున్నారు. ఈ విషయం తెలిస్తే ఇంట్లో వారు మందిలిస్తారన్న భయంతో చాలా మంది విద్యార్థులు ఒంటరిగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని పోలీసులు గుర్తించారు.

Next Story