సుమారుగా నెలన్నర క్రితం కిలో ఉల్లి ధర రూ.200కు చేరింది. ఆ తర్వాత నిదానంగా తగ్గుతూ తగ్గుతూ..నిన్నమొన్నటి వరకూ కిలో ఉల్లి రూ.20కి వచ్చింది. కరోనా ప్రభావంతో ఇప్పుడు మళ్లీ ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. శనివారం కిలో ఉల్లి రూ.20 ఉండగా..గురువారం మార్కెట్ వేలంలో మొదటి మేలు రకం కిలో ఉల్లి రూ.33 పలికింది. ఉల్లి ధర ఒక్కసారిగా 13 రూపాయలు పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు అవాక్కయ్యారు. కరోనా వైరస్ కారణంగా మరికొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే మళ్లీ ఉల్లి ధరలు రూ.100 దాటిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

వరుస సెలవులు కూడా ఒక కారణం..

అదివారం జనతా కర్ఫ్యూ, సోమవారం మార్కెట్లలో శానిటైజేషన్ చేయాలని, మంగళవారం అమావాస్య కారణంగా మార్కెట్ మూసివేయడం, బుధవారం ఉగాది సెలవు..ఇలా వరుసగా నాలుగురోజులు మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో ఉల్లితో పాటుగా ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగాయి. వారం క్రితం కిలో టమాటా రూ.10 -15 ఉండగా ఇప్పుడు ఏకంగా కిలో రూ.50కి అమ్ముతున్నారు. అక్కడక్కడా ఉన్న మార్కెట్లలో ప్రజాప్రతినిధులు తిరుగుతూ అధిక ధరలకు విక్రయించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో మాత్రమే కూరగాయలు తక్కువ ధరలకు దొరుకుతున్నాయి.

Also Read : సారీ బ్రదర్..అది జక్కన్న ఇస్తానన్నారు

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.