మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సర్ ప్రైజ్ ఇస్తున్నా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దానికి రామ్ చరణ్ అవునా బ్రదర్ నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానంటూ బదులిచ్చారు.  శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్ఆర్ఆర్ ఇస్తానన్న సర్ ప్రైజ్ కూడా ఇవ్వలేదు. దీంతో రామ్ చరణ్ నిరాశ చెందారు.

Also Read : వైరల్ అవుతోన్న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సాంగ్

మళ్లీ ఎక్కడ బ్రదర్ సర్ ప్రైజ్ అని అడుగగా..” సారీ బ్రదర్, గురువారం రాత్రి ఆ సర్ ప్రైజ్ నేను ఇస్తానని జక్కన్న చెప్పడంతో ఆయనకు పంపించా” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇందుకు రామ్ చరణ్ ”ఏంటీ, గిఫ్ట్ ఆయనకు పంపించావా ? ఇక ఈరోజుకీ ఆ సర్ ప్రైజ్ చూస్తానో లేదో ” అంటూ బదులిచ్చారు.

” సాయంత్రం 4 గంటలకు జక్కన్న ఆ సర్ ప్రైజ్ రివీల్ చేస్తానని చెప్పారు. ఇప్పుడే ఆయనతో మాట్లాడా ” అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇలా ట్విట్టర్ లో ఆర్ఆర్ఆర్ టీం మధ్య సరదా సంభాషణ జరిగింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.