మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సర్ ప్రైజ్ వీడియో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా..ఇప్పటి వరకూ చరణ్ చేసిన సినిమా పేర్లతో రూపొందించిన పాటొకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read : ఫ్యాన్స్ కు పండగే..ఆర్ఆర్ఆర్ సర్ ప్రైజ్ వీడియో..

మధుర ఆడియో లో గురువారం రాత్రి రిలీజ్ అయిన ఈ పాట ఇప్పటికే 80 వేల వ్యూస్ సంపాదించుకుంది. #RamKonidelaBdaySplSong #HBDRoyalRAMCHARAN హ్యాష్ ట్యాగ్ లతో టాప్ 20లో ట్రెండ్ అవుతోంది.

Also Read : భారీ కాయాన్ని చూసి షాక్ కొట్టిన పిట్టల్లా..నగ్నంగా చూస్తుండగానే..

ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా ఉన్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.