భారీ కాయాన్ని చూసి షాక్ కొట్టిన పిట్టల్లా..నగ్నంగా చూస్తుండగానే..

By రాణి  Published on  26 March 2020 3:14 PM GMT
భారీ కాయాన్ని చూసి షాక్ కొట్టిన పిట్టల్లా..నగ్నంగా చూస్తుండగానే..

కొత్తగా పెళ్లైన దంపతులు ఎక్కడైనా ఏకాంతంగా గడపాలని కోరుకుంటారు. అలాగే అనుకున్న ఇంగ్లాండ్ కు చెందిన ఓ జంట ఇండోనేషియాలోని బాలిలో ఉన్న ఒక ఫైవ్ స్టార్ రిసార్టులో దిగి..సూట్ రూమ్ తీసుకున్నారు. ఇక మూడ్రోజులు తాము స్వర్గంలో తేలిపోవచ్చని కలలు కన్నారు. హనీమూన్ సమయం కాబట్టి ఎవరూ డోర్ తట్టకుండా Do Not Disturb అని బోర్డు కూడా పెట్టారు. ఇక అంతే..వాళ్లిద్దరి రాసలీలలకు హద్దులు, అవధులూ లేవు. రాత్రి, పగలు తేడా లేకుండా స్వర్గ లోకపు అంచుల్లో విహరించారు.

Also Read : 135 కిలోమీటర్లు..రెండురోజులు..అయినా వదలని పోలీసులు

బాల్కనీలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్ లో జంటగా స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అంతా బాగానే ఉంది. ఆ రోజు రాత్రి ఇద్దరూ శృంగారంలో ఉండగా..వారి మంచం కింది నుంచి వింత వింత శబ్దాలు రాసాగాయి. పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఆ శబ్దాలు మరింత పెద్దవయ్యాయి. ఏమిటో చూద్దామని లైట్ వేయగా..భారీ కాయంతో ఉన్న మొసలి. దానిని చూసిన ఆ హనీమూన్ జంటకు ఊపిరాగినంతపనైంది.

Also Read : లాక్ డౌన్ అయిన వేళ..భారీ విరాళాలిచ్చిన సెలబ్రిటీలు

నగ్నంగానే ఉన్న వారిద్దరూ మంచం మీద షాక్ కొట్టిన పిట్టల్లా స్తంభించి ఆ మొసలిని చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి అది నెమ్మదిగా నడుచుకుంటూ బాల్కనీలోంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకింది. తర్వాత ఆ జంట రిసార్ట్ సిబ్బందికి జరిగిన విషయం చెప్పగా..సిబ్బంది వచ్చి మొసలిని బంధించారు. తమ రిసార్టులో ఇలాంటివన్నీ కామనే అని చెప్పడం గమనార్హం. ఇదంతా గతవారం జరిగింది.

Next Story