135 కిలోమీటర్లు..రెండురోజులు..అయినా వదలని పోలీసులు

By రాణి  Published on  26 March 2020 2:18 PM GMT
135 కిలోమీటర్లు..రెండురోజులు..అయినా వదలని పోలీసులు

మహారాష్ట్ర..దేశంలోనే అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రమిది. కరోనా ప్రభావంతో సొంతఊళ్లకు దూరంగా ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు కూడా తమ ఇంటికి చేరుకోవాలని ఉబలాటపడుతున్నారు. కానీ..ఎవరినీ ఎక్కడికీ పంపట్లేదు. రాష్ట్రాల సరిహద్దులు మూసివేతతో పాటు..ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో స్వయంగా గ్రామస్తులే కంచెలు ఏర్పాటు చేసుకున్నారు.

Also Read : డర్టీ టాక్‌ ఛీ కాదు.. రొమాన్స్‌కు మెడిసన్‌

అయితే మహారాష్ట్రలో ఓ కూలీ మాత్రం తాను సొంత ఊరికి చేరాలన్న కలను నడకతో సాధ్యం చేసుకున్నాడు. జాంబ్ కు చెందిన నరేంద్ర కూలీ పనుల కోసం పూణెకు వెళ్లాడు. ఇటీవల అక్కడ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో చంద్రాపూర్ జిల్లా జాంబ్ కు చెందిన నరేంద్ర వెంటనే ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ అది అతను అనుకున్నంత సులువు కాలేదు. కర్ఫ్యూ విధింపుతో అన్ని రవాణా మార్గాలు నిలిచిపోయాయి. దీంతో ఎలాగైనా ఇంటికి చేరాలనుకున్న అతని సంకల్పం కాలికి పనిచెప్పేలా చేసింది. అనుకున్నదే తడవుగా సొంతఊరి వైపుకి నడక సాగించాడు. రెండ్రోజులు..దారిలో తినేందుకు తిండి కూడా దొరకలేదు. అక్కడక్కడా మంచినీరు తాగుతూనే 135 కిలో మీటర్లు నడిచాడు. గ్రామానికి చేరేందుకు ఇంకా 25 కిలోమీటర్లే ఉందనగా..బుధవారం రాత్రి పెట్రోలింగ్ పోలీసులు ఆ కూలీని ఆపి కర్ఫ్యూ నిబంధనను ఎందుకు ఉల్లంఘించావని ప్రశ్నించారు.

Also Read : లాక్ డౌన్ అయిన వేళ..భారీ విరాళాలిచ్చిన సెలబ్రిటీలు

తన గోడును నరేంద్ర పోలీసులకు వెలిబుచ్చుకున్నాడు. స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు చేయించగా..ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు వైద్యులు. రెండ్రోజులుగా తిండి తిప్పలు లేకుండా నీరు తాగుతూనే అతను ఇంత దూరం వచ్చానని చెప్పగా..ఎస్సై దయాగుణంతో ఇంటి నుంచి భోజనం తెప్పించి పెట్టారు. తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో నరేంద్రను ఇంటి వద్ద దింపారు. ఇంటికెళ్లాక 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా నరేంద్రకు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story