తూర్పుగోదావరిలో గ్యాస్‌ లీక్‌ కలకలం

By అంజి  Published on  2 Feb 2020 2:04 PM GMT
తూర్పుగోదావరిలో గ్యాస్‌ లీక్‌ కలకలం

ముఖ్యాంశాలు

  • తూర్పు గోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్‌ పైప్‌ లీక్‌
  • కిలోమీటర్‌ పరిధిలో ఇళ్లు ఖాళీ చేయించిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్‌ లీక్‌ కలకలం రేపుతోంది. కాట్రేనికోన మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉప్పూడిలో భారీగా గ్యాస్‌ లీక్‌ అవుతుండడంతో.. పోలీసులు ముందస్తు రక్షణా చర్యల్లో భాగంగా గ్యాస్‌ లీక్‌ అవుతున్న ప్రదేశం నుంచి కిలోమీటర్ పరిధిలోని ఇళ్లను ఖాళీ చేయించారు. కాట్రేనికోన మండలానికి తాత్కాలికంగా వావానాల రాకపోకలను నిలిపివేశారు. గ్యాస్‌ లీకవుతున్న సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ అధికారులకు చేరవేశారు.

ONGC Gas Pipeline Leak

ఉప్పూడిలో 10 సంవత్సరాల క్రితం ఓఎన్జీసీ సంస్థ గ్యాస్‌ లైన్‌లను ఏర్పాటు చేసింది. గతంలో ఓఎన్జీసీ సిబ్బంది నిర్వహణలో భాగంగా పైప్‌ లైన్‌కు డ్రిల్‌ చేశారు. లో ప్రేజర్‌ గ్యాస్‌ ఉండటంతో డ్రిల్లింగ్‌ పూర్తి చేసి సీల్‌ వేశారు. ఇవాళ పైప్‌ లైన్‌ చెకింగ్‌ నిమిత్తం సిబ్బంది వచ్చారు. రిగ్‌ మరమ్మత్తులు నిర్వహించే సమయంలో వాల్‌ వదిలి వేయడంతో గ్యాస్‌ ఉవ్వేత్తున ఏగసిపడింది. భారీ శబ్దాలతో గ్యాస్‌ ఎగిసి పడుతుండటంతో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రిగ్‌ పరిసరాల పరిధిలోని ఇళ్లను పోలీసులు ఇప్పటికే ఖాళీ చేయించారు. సంఘటనా స్థలాన్ని అమలాపురం ఆర్జీవో భవానీ శంకర్‌, ముమ్మడివరం సీఐ రాజశేఖర్‌లు పరిశీలించారు. ఉప్పూడి గ్రామంలో ఎవరూ కూడా వంట పోయ్యిలు వెలిగించవద్దని.. అగ్రి ప్రమాదం సంభంవించేందుకు దోహదం చేసే ఏ విధమైన వస్తువులను ఉపయోగించవద్దని పోలీసులు హెచ్చరించారు.

23 24 25

Next Story