కేరళ: ఏనుగు మృతి కేసులో ఒకరి అరెస్ట్
By సుభాష్ Published on 5 Jun 2020 2:17 PM ISTకేరళలోని మలప్పురంలో స్థానికులు పేలుడు పదార్థాలతో నిండిన ఫైనాపిల్‌ను ఏనుగుకు తినిపించగా, అది పేలి తీవ్ర రక్రస్రావంతో నదిలోకి వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని స్పష్టం చేసింది. ఇక తాజాగా ఈ ఏనుగు మృతి కేసులో ఒకరిని అరెస్టు చేశామని, త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామని కేరళ అటవీ శాఖ మంత్రి తెలిపారు. ఈ కేసులోఅరెస్టు అయిన వ్యక్తి పేలుడు పదార్థాలు విక్రయిస్తాడని అటవీశాఖ అధికారులు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. (ఇది కూడా చదవండి: ఏనుగు మృతి: నిందితుల ఆచూకీ చెబితే రూ.2 లక్షల నగదు ప్రకటించిన హైదరాబాద్ వాసి)
ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏనుగును మృతికి కారణమైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని, ఇప్పటికే ముగ్గురు అనుమానితులు గుర్తించామని గురువారం వెల్లడించిన వెల్లడించారు.