Fact Check : యాంకర్ ఓంకార్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2020 8:31 AM GMT
Fact Check : యాంకర్ ఓంకార్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందా..?

కరోనా రోగుల సంఖ్య దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో పలువురు ప్రముఖులు కూడా చేరుతున్నారు. తెలంగాణ హోమ్ మినిస్టర్ మొహమూద్ అలీ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. హోంమంత్రితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు‌. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న మహమూద్ అలీ మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఆస్తమా ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచే ఆయనను అపోలోకు తరలించినట్లు తెలుస్తోంది. మరి కొందరు పొలిటీషియన్స్ కూ, సెలెబ్రిటీలకు కూడా కరోనా సోకిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజుల పాటూ షూటింగ్ లు మూతపడ్డాయి. తాజాగా అధికారులు హైదరాబాద్ లో షూటింగ్ చేసుకోడానికి అనుమతులు ఇవ్వడంతో షూటింగ్ ల సందడి మొదలైంది. షూటింగ్ లు, టీవీ షోలు కూడా మొదలయ్యాయి. ఆ షూటింగ్ లలో కూడా కరోనా కలకలం మొదలైంది. పలువురు నటీ నటులకు కరోనా సోకిందంటూ వార్తలు వచ్చాయి.



టీవీ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ కు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేశాయి. ఇస్మార్ట్ జోడీ షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన ఓంకార్ కు కరోనా సోకిందని.. దీంతో ఉన్నట్లుండి ఓంకార్ షూటింగ్ నుండి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. ఓంకార్ ఎందుకు రాలేదని ఆరా తీస్తే కరోనా సోకిందని తేలిందంటూ పలు సంస్థలు కథనాలను వండి వార్చాయి.

నిజ నిర్ధారణ:

యాంకర్ ఓంకార్ కు కరోనా వైరస్ సోకిందన్నది 'అబద్ధం'

మీడియా సంస్థలు చేసిన ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ఓంకార్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు తేల్చి చెప్పారు. ఓంకార్ కరోనా పరీక్షలు చేయించుకోగా అందులో నెగటివ్ అని వచ్చిందని.. ఓంకార్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. ఈ విషయంపై పలు మీడియా సంస్థలు స్పందించాయి. ఓంకార్ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ క్లారిటీ ఇచ్చాయి.

మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలకు సంబంధించిన వార్తలు:

https://www.eenadu.net/cinema/latestnews/omkar-anchor-clarifies-about-he-affected-by-coronavirus/0200/120080175

https://telugu.samayam.com/tv/news/telugu-anchor-omkar-reportedly-tests-positive-for-coronavirus/articleshow/76665216.cms

ఓంకార్ కు కరోనా పాజిటివ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలు అబద్దమే. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Claim Review:Fact Check : యాంకర్ ఓంకార్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందా..?
Claim Fact Check:false
Next Story