అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందేనని.. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానుల విధానాన్ని తాము ఒప్పుకోమని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వారి నిరసనలకు 300 రోజులు పూర్తయ్యింది.

ఈ సమయంలో కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ ఫోటోలలో ఓ మహిళను పోలీసులు లాక్కెల్తూ ఉన్నారు. దీనిపై టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ట్వీట్ చేశారు. రైతులు రాజధాని కోసం భూములు ఇస్తే.. ఇప్పుడు వారితో ఇలా ప్రవర్తిస్తారా అని ఆమె ట్వీట్ లో చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు కేవలం జగన్ పరిపాలనలో చోటు చేసుకుంటాయని ఆమె ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు.

P1

శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలను కొట్టించి, కేసులు పెట్టించిన ఘనత ఒక్క జగన్ రెడ్డికే దక్కుతుంది. ఉగ్రవాద మనస్తత్వంతో మహిళలను బూటుకాళ్లతో తన్నించింది మీరు కాదా జగన్? వందేళ్లకు సరిపడా మహిళలపై క్రిమినల్ కేసులు పెట్టించారు. వృద్ధుల నుండి పసి మొగ్గల వరకు నీ రాక్షస పాలనతో రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. నీ చేష్టలు చూసి తెలుగు తల్లి కూడా కన్నీరు పెడుతుంది అంటూ జగన్ పై ఆమె విరుచుకుపడ్డారు. మహిళలు ఆగ్రహిస్తే ఆదిశక్తులై తిరగబడతారన్న సంగతి మర్చిపోవద్దు. మహిళల సత్తా ఏంటో నీకు రుచిచూపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కేవలం మహిళల ఓట్లతో జగన్ పతనం కాబోతున్నాడు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ ఫోటోలకు అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమాలకు ‘ఎటువంటి సంబంధం లేదు’. వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం.

వైరల్ అవుతున్న మొదటి ఫోటోను అక్టోబర్ 2015 లో నటుడు కుషాల్ ఠాకూర్ పోస్టు చేశారు. ‘The Confused Indian’ అంటూ ఓ పోస్టును పెట్టాడు. ‘వారు ఏ తప్పు చేశారో తెలీదు. కానీ ఆ బాలికను ఇలా జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లడం మాత్రం తప్పు. బాలికను జట్టుపట్టుకుని లాక్కెళ్ళడానికి ఎటువంటి అధికారాలను మహిళా పోలీసుకు ఇవ్వలేదు. ఆ మహిళా పోలీసు అధికారి సస్పెండ్ అయ్యే వరకూ ఫేమస్ చేద్దాం’ అని కుషాల్ తన పోస్టు ద్వారా తెలియజేశాడు.

విజయవాడ పోలీసులు కూడా ఈ ఫోటోలకు అమరావతి రైతుల సమస్యకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇవి చాలా పాత ఫోటోలు అని అన్నారు. తప్పుడు కథనాలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి ఫోటో 2015 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందని అన్నారు. రెండో ఫోటో 2017లో తీసిందని పోలీసులు స్పష్టం చేశారు. రెండో ఫోటో 2017 సంవత్సరంలో తుండూరు లో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన ఫోటో అని చెప్పుకొచ్చారు. అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు కేసు పెడుతూ ఉన్నామని పోలీసులు స్పష్టం చేశారు. ‘#FACTCHECK-These r old pics. The first picture is of 2015 and not related to AP Police and the second picture is related to protest against #MegaAquaFoodPark Tundurru/WG in 2017. These pictures are being circulated in 2020 as part of false propaganda. Previously on a similar post, a case in CrNo 10/2020 u/s 469,505(2) r/w 34 IPC was registered in SRpet PS on people spreading #FakeNews. A case is being registered on this post. @APPOLICE100 @appolicetv #[email protected] అంటూ ట్వీట్ చేశారు.

మొదటి ఫోటో ఘటనకు సంబంధించిన సమాచారం తెలియలేదు. రెండో ఘటన మాత్రం జులై 2017కు సంబంధించినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెస్ట్ గోదావరి జిల్లాలోని తాండూరు, కంసాలి బెతపూడి, జొన్నలగరువు గ్రామాల ప్రజలు ఆక్వా మెగా ఫుడ్ పార్క్ విషయంలో తీవ్ర ఆందోళన చేశారు. ఈ ఘటనలో 12 మందిని అరెస్టు చేయగా, 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 26 మంది మహిళలు కూడా ఉన్నారు. Deccan Chronicle, The News Minute మీడియా సంస్థలు ఈ ఘటనపై కథనాలను ప్రచురించాయి.

కాబట్టి అమరావతి రైతులపై పోలీసుల దౌర్జన్యం అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort