Fact Check : నరేంద్ర మోదీ బీహార్ పర్యటనకు రాకూడదని రోడ్డు మీద 'గో బ్యాక్ మోదీ' అనే నినాదాలను రాశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2020 11:35 AM GMT
Fact Check : నరేంద్ర మోదీ బీహార్ పర్యటనకు రాకూడదని రోడ్డు మీద గో బ్యాక్ మోదీ అనే నినాదాలను రాశారా..?

బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. బీహార్ ఎన్నికల ప్రచారానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెళ్లనున్నారు. పలు చోట్ల ఆయన సభలను నిర్వహిస్తూ ఉన్నారు. మోదీ బీహార్ పర్యటనకు రావడం బీహార్ వాసులకు ఇష్టం లేదని.. అందుకే రోడ్ల మీద గ్రాఫిటీతో పెద్ద ఎత్తున 'గో బ్యాక్ మోదీ' అంటూ నినాదాలు రాస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలుస్తూ ఉన్నాయి.

రోడ్డు మీద పెద్ద ఎత్తున 'గో బ్యాక్ మోదీ' అంటూ గ్రాఫిటీతో రాసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. బీహార్ మోదీ మీద ఆగ్రహంతో ఉందంటూ పోస్టుల్లో చెప్పుకొచ్చారు. #GoBackModi అనే హ్యాష్ ట్యాగ్ లను జోడిస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోలో గోధుమ రంగులో ఉన్న ఓ బిల్డింగ్ ను మనం చూడొచ్చు.. అక్కడ ఉన్న బిల్ బోర్డులో “METRO CHANNEL CONTROL POST, HARE STREET POLICE STATION” (మెట్రో ఛానల్ కంట్రోల్ పోస్ట్, హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్) అని ఉంది.

గూగుల్ మ్యాప్స్ లో ఈ లొకేషన్ అడ్రెస్ కూడా దొరికింది. మెట్రో ఛానల్ కంట్రోల్ పోస్టు, హరే ప్రీత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఇది కలకత్తా లోని ఎస్ప్లనాదే ప్రాంతంలో ఉంది.

https://maps.app.goo.gl/B8tP992dbpULqV4o8

న్యూస్ మీటర్ ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జనవరి 2020న పలు మీడియా సంస్థలు, పలువురు ఈ ఫోటో ను పోస్టు చేశారు. జర్నలిస్ట్ మయూఖ్ రంజన్ ఘోష్ కూడా ఈ ఫోటోను పోస్టు చేశారు. కలకత్తా లోని ఎస్ప్లనాదే ప్రాంతంలో ఇలా 'గో బ్యాక్ మోదీ' అంటూ రాస్తున్నారని మయూఖ్ రంజన్ చెప్పుకొచ్చారు. ఎంతో బిజీగా ఉండే ఈ రోడ్డు మీద విద్యార్థులు ఇలా నిరసనలను ప్రదర్శిస్తూ ఉన్నారని తెలిపారు.



TIMES OF INDIA కూడా 2020 సంవత్సరం జనవరి నెలలో ఈ గ్రాఫిటీకి సంబంధించి కథనాలను రాసుకొచ్చాయి. “Prime Minister Narendra Modi leaves Kolkata, protesters shift venue” అంటూ రాసుకుని వచ్చారు అందులో. సిటిజెన్ షిప్ బిల్ కు వ్యతిరేకంగా ఎంతో మంది యూనివర్సిటీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా అప్పట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిఏఏ, ఎన్.ఆర్.సి. బిల్లులకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. మోదీ ఏరియల్ రూట్ లో కోల్ కతా ఎయిర్ పోర్టు నుండి వెళ్లిపోయారు.

వైరల్ అవుతున్న ఫోటో బీహార్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్నది కాదు.. సిఏఏ నిరసనల సమయంలో కోల్ కతాలో తీసిన ఫోటోలు. వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.

Claim Review:Fact Check : నరేంద్ర మోదీ బీహార్ పర్యటనకు రాకూడదని రోడ్డు మీద 'గో బ్యాక్ మోదీ' అనే నినాదాలను రాశారా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story