మనవళ్లకు కరోనా అంటుతుందనే భయంతో వృద్ద దంపతుల ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Aug 2020 6:50 AM GMT
మనవళ్లకు కరోనా అంటుతుందనే భయంతో వృద్ద దంపతుల ఆత్మహత్య

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా పట్ల నిర్లక్ష్యం, అపోహ రెండూ ప్రమాదకరమే. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అంతే తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. లేక అపోహలతో ఎక్కువగా ఆందోళన చెందిన ఆప్రాణాలకే ప్రమాదం. కొద్ది రోజులుగా జ్వరంతో ఆ వృద్ద దంపతులు బాధపడుతున్నారు. మందులు వాడుతున్నా.. తగ్గకపోవడంతో తమకు కరోనా సోకిందనే ఆందోళన చెందారు. ఆస్పత్రిలో చేరిన ఫలితం ఉందని అపనమ్మకం పెంచుకున్నారు. తమ కారణంగా తమ మనవళ్లకు అది సోకుతుందేమోన్న భయం వారిని ప్రాణ త్యాగానికి ఒడిగట్టేలా చేసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎడమ వెంకటేశ్వర నాయుడు(65), వెంకటలక్ష్మి(60) దంపతులు ఖైర‌తాబాద్‌లో నివాసముంటున్నారు. వారికి స‌మీపంలోనే వారి కుమారులు వేరే ఇళ్ల‌ల్లో కాపుర‌ముంటున్నారు. మన‌వ‌ళ్లు ప్రతి రోజూ ఆడుకునేందుకు తాత‌య్య‌, నాన్న‌మ్మ ఇంటికి వ‌స్తుంటారు. ఇటీవ‌ల ఈ దంప‌తులిద్ద‌రికి జ్వ‌రం వచ్చింది. మెడిసి‌న్ వాడుతున్నా త‌గ్గ‌క‌పోవ‌డంతో.. త‌మ‌కు కరోనా వచ్చిందేమోన‌ని వారు ఆందోళ‌న చెందారు. తమ మనవళ్లను ఇంటికి రావద్దని చెప్పారు.

మందులు వేసుకుంటున్నా.. జ్వరం తగ్గకపోవడంతో వారిలో తమకు కరోనా సోకిందనే అనుమానం మొదలైంది. ఆస్పత్రిలో చేరినా.. చనిపోతామని ఆందోళన చెందారు. మనవళ్లు.. ఇంటికి వస్తాం అంటూ మారాం చేస్తుండడంతో.. తమ కారణంగా వారికి కూడా కరోనా సోకుందని భయపడ్డారు. పిల్లలకు కరోనా రావొద్ద‌నే తాము చనిపోతున్నామంటూ కాగితంపై రాసి.. శుక్ర‌వారం రాత్రి కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి తాగారు. తెల్లారేస‌రికి విగ‌త‌జీవులై క‌నిపించారు.

Next Story