మేక‌ను పెళ్లి చేసుకున్న యువ‌కుడు.. వైర‌ల్

Young Man Marriage with goat in Nuziveedu.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘ‌ట్టం. జీవితాంతం గుర్తుండిపోయే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2022 5:57 AM GMT
మేక‌ను పెళ్లి చేసుకున్న యువ‌కుడు.. వైర‌ల్

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘ‌ట్టం. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. నిశ్చితార్థం మొదలుకొని శుభలేఖలు, పెళ్లి మంటపం, భోజనాలు, బరాత్.. ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఎవ‌రి తాహ‌త్తుకు త‌గ్గ‌ట్లు వారు వివాహాలు చేసుకుంటారు. ఇటీవ‌ల కొంద‌రి వివాహాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అలాగే ఇక్క‌డ ఓ యువ‌కుడు చేసుకున్నపెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇదేం పెళ్లి..? ఇలాంటి వివాహాన్ని ఎప్పుడూ చూడలేని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ పెళ్లిలో వధువు ఎవరో తెలుసా.. అందమైన యువతి కాదు.. ఒక మేక. అవును ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు.

వివ‌రాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ఓ యువ‌కుడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో అత‌డి జాత‌కాన్ని జ్యోతిష్యుడికి చూపించారు. అత‌డి జీవితంలో రెండు వివాహాలు జ‌రుగుతాయ‌ని ఉంద‌ని వారు చెప్పారు. దోష నివార‌ణ‌కు శుభకృత నామ సంవత్సర ఉగాది రోజు విస్సన్నపేట రోడ్డులో ఉన్న నవగ్రహ ఆలయ ఆవరణలో అర్చకులు మొదటి వివాహంగా యువకుడికి మేక తో వివాహం జరిపించారు. ఈ తంతులో యువకుడు, అతని తల్లిదండ్రులు, అర్చకుడు మాత్రమే పాల్గొన్నారు.

Next Story