కాబోయే భర్త ఉద్యోగం పోయింది.. అతడిని పెళ్లి చేసుకోవాలా..? వద్దా..?
Woman's query on marrying fiance who got laid off from Microsoft.ఓ యువతి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో
By తోట వంశీ కుమార్ Published on 7 Feb 2023 8:01 AM ISTఆర్థిక మాంద్యం భయాలు చుట్టుముట్టాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు తమ వ్యయాన్ని తగ్గించుకునే పనిలో ఉన్నాయి. చాలా కంపెనీలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా ఐటీ కంపెనీల్లో కనిపిస్తోంది. గూగుల్, మెటా, మైకోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దీంతో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. లే ఆఫ్స్‌తో ఉద్యోగుల జీవితాలు తల్లకిందులు అవుతున్నాయి. ఇది అతడి పైనే కాదు అతడి కుటుంబంపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
తాజాగా ఓ యువతి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు కాబోయే భర్తను మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుంచి తీసివేసిందని, ఇప్పుడు అతడిని తాను పెళ్లి చేసుకోవాలా..? వద్దా అంటూ నెటీజన్లు అడుగుతోంది. తమది లవ్ మ్యారేజ్ కాదని, అరెంజ్ మ్యారేజ్ అని చెప్పుకొచ్చింది.
"నాకు కాబోయే భర్త మైక్రోసాఫ్ట్ ఇండియాలో పని చేసున్నాడు. అతడి జీతం రూ.2.5లక్షలుగా ఉంది. మా ఇద్దరికి ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. అయితే.. ఇప్పుడు అతడిని మైకోసాఫ్ట్ ఇండియా ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయం మా కుటుంబానికి కూడా తొలుసు. ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకోవాలా..? వద్దా..? అన్నది అర్థం కావడం లేదు." అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
ఇంకేముంది ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు యువతికి మద్దతుగా మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం అతడికి నీ కంటే మంచి అమ్మాయి దొరుకుతుందని కామెంట్లు పెడుతున్నారు.
గత నెలలో (జనవరి)లో 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.