650 అడుగుల మంచుకొండపై లవ్ ప్రపోజల్.. చివరికి ?

Woman Miraculously Survives 650-ft Fall from Cliff Just After Accepting Boyfriend's Proposal. ప్రేమకు అంగీకారం తెలిపిన మహిళ కొంత సమయంలోనే ఆ కొండపై నుంచి జారి కిందకు పడింది

By Medi Samrat  Published on  3 Jan 2021 6:21 AM GMT
love proposal

ఈ మధ్యకాలంలో ఇద్దరికి సంబంధించిన ఎటువంటి చిన్న ఫంక్షన్ అయినా ఎంతో అట్టహాసంగా నిర్వహించడం ఫ్యాషనైపోయింది. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కొందరు ఎన్నో సాహసాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో ప్రేమ వ్యక్తపరచాలన్న ఎంతో భిన్నంగా ఉన్న ప్రదేశాలకు వెళ్లి వారిలో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.ఈ విధంగానే ఓ జంట తన ప్రేమించిన అమ్మాయికి ఎంతో స్పెషల్ గా ఉండేలా లవ్ ప్రపోజ్ చేయాలని భావించిన ఆ వ్యక్తి ఏకంగా 650 అడుగుల కొండపైకి వెళ్లి లవ్ ప్రపోజ్ చేశాడు. కానీ ఆ కొండపై నుంచి ఒక్కసారిగా జారీ అతని ప్రియురాలు కింద పడిన ఘటన ఆస్ట్రియాలోని కారింథియాలో చోటు చేసుకుంది.

ఆస్ట్రియాలోని కారింథియాకి చెందిన 32 ఏళ్ల మహిళ, 27ఏళ్ల వ్యక్తి గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు.అయితే ఆ వ్యక్తి ఆమెకు తన ప్రేమ విషయాన్ని ఎంతో భిన్నంగా వ్యక్తపరచాలని భావించాడు. ఇందుకోసం కోసం డిసెంబర్ 26న వారిద్దరు ఫాల్కర్ట్ పర్వతాన్ని అధిరోహించి ఆ మరుసటి రోజు ఇద్దరు ఆ శిఖరాన్ని చేరుకున్నారు.ఆ కొండపై ఆ వ్యక్తి తనలో ఉన్న ప్రేమను వ్యక్తపరచగా అందుకు ఆమె అంగీకారం తెలిపింది.

తన ప్రేమకు అంగీకారం తెలిపిన మహిళ కొంత సమయంలోనే ఆ కొండపై నుంచి జారి 650 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడింది. అయితే కింద మంచు ఎక్కువగా ఉండటం వల్ల ఆమెకు ఎటువంటి ప్రాణ పాయం ఏర్పడలేదు.అయితే తన ప్రియురాలిని పట్టుకునే నేపథ్యంలో ఆ వ్యక్తి కూడా కొండ అంచున వేలాడుతూ గాలిలో కనిపించాడు. ఇతనిని చూసిన కొందరు ఈ విషయాన్ని రెస్క్యూ అధికారులకు తెలియజేయగా వారు హెలికాప్టర్ నుంచి వచ్చి ఆ ఇద్దరిని కాపాడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉండటం వల్ల వీరి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదని,అదే వేసవి కాలంలో అయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పోలీస్ అధికారులు తెలియజేశారు.


Next Story