ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమలో ఉన్న వారికి ఈ సమాజంలో ఏం జరుగుతుందో కనిపించదు అంటారు. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. అలా ఎప్పుడూ ఎవరి జీవితంలో ప్రేమ మొదలవుతుందో చెప్పలేము. అంతేకాకుండా ప్రేమకు వయసు అడ్డురాదని మరికొంతమంది చెప్పే మాటలను ఈ వ్యక్తులు నిజం చేసి చూపించారు. ఇందుకు నిదర్శనంగా బ్రిటన్ లో 81 సంవత్సరాల మహిళ, ప్రేమ వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)కు చెందిన ఐరిష్‌ జోనిస్‌ (81) అనే వృద్ధ మహిళ,ఈజిప్ట్‌కు చెందిన మహమ్మద్‌ అహ్మద్‌ ఇబ్రహీం (35) అనే వ్యక్తితో తొలుత పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఈజిప్ట్ పర్యటన కోసం వెళ్లిన

జోనిస్‌ కు మహమ్మద్ తో పరిచయం ఏర్పడింది. తొలి పరిచయం లోనే అతని తో ప్రేమలో పడిన జోనిస్‌ తరువాత తన ప్రియుని కలవడానికి మరో రెండుసార్లు ఈజిప్టు వెళ్ళింది. అయితే ఈజిప్టు వాతావరణం ఆమెకు ఎంతో ఇబ్బందికరంగా అనిపించడంతో ఏకంగా మహమ్మద్ ను పెళ్లి చేసుకుని యూకే లోనే సెటిల్ అవ్వాలని భావించింది.

అనుకున్న ప్రకారమే తనకంటే వయసులో 45 సంవత్సరాలు చిన్నవాడైనా మహమ్మద్ ను జోనిస్‌ పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే జోనిస్‌ కు 50 సంవత్సరాల వయసున్న ఇద్దరు కొడుకులు ఉండటం విశేషం. తన తల్లి ప్రేమ వివాహానికి కొడుకులు అడ్డు చెప్పకపోవడంతో జోనిస్‌ మహమ్మద్ ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన సదురు నెటిజన్లు లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. అయితే ఈ విషయంపై జోనిస్‌ మాట్లాడుతూ ఈ వయసులో తనకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


సామ్రాట్

Next Story