భర్తకు విడాకులు.. మామతో పెళ్లి

Woman marries ex-husband's stepfather. ఓ మ‌హిళ‌.. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి మామ‌ను(భ‌ర్త తండ్రిని) పెళ్లాడింది. ఈ ఘ‌ట‌న అమెరికాలోని కెంటుకీలో జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 2:25 AM GMT
woman marries ex-husband  step father

కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే.. ప్ర‌స్తుతం కాలం ఎటుపోతుందో అనిపించ‌క మాన‌దు. ఒక‌ప్పుడు పెళ్లి చేసుకుంటే జీవితాంతం క‌లిసి ఉండేవారు. క‌ష్టాలు ఎదురైన‌ప్ప‌టికీ కూడా ఇద్ద‌రూ క‌లిసి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగేవారు. అయితే.. ప్ర‌స్తుతం చాలా మంది అలా ఉండ‌డం లేదు. చిన్న క‌ష్టం రాగానే వెంట‌నే విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారు. మ‌రో దారుణ విష‌యం ఏంటంటే.. వివాహం జ‌రిగిన త‌రువాత మ‌రొక‌రితో ప్రేమ‌లో ప‌డ‌డం.. వారితో క‌లిసి జీవించ‌డం కోసం ఇప్పుడున్న బంధాన్ని తెంచుకుంటున్నారు. తాజాగా ఓ సంఘ‌ట‌న‌ను చూస్తే.. క‌లికాలం అనిపించ‌క మాన‌దు. ఓ మ‌హిళ‌.. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి మామ‌ను(భ‌ర్త తండ్రిని) పెళ్లాడింది. ఈ ఘ‌ట‌న అమెరికాలోని కెంటుకీలో జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కెంటుకీలో హారోడ్స్బ‌ర్గ్ అనే ప్రాంతంలో జెఫ్(60), క్విగ్లే ఎరికా(31) కుటుంబాలు నివ‌సిస్తున్నాయి. కాగా.. క్విగ్లేకు 16 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు జెఫ్ స‌వతి కుమారై ( తన భార్య మొదటి భర్తకు పుట్టిన అమ్మాయి) తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త మంచి స్నేహాంగా మారింది. ఈ క్ర‌మంలో ఆమెకు జ‌స్టిన్‌తో (జెఫ్ స‌వ‌తి కుమారుడు) ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది కాస్త ప్రేమ‌గా మార‌డంతో ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రికి ఓ కొడుకు పుట్టాడు.

క్విగ్లే, జ‌స్టిన్‌ల కాపురం కొన్నాళ్ల పాటు స‌జావుగానే సాగినా.. త‌రువాత వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. దీంతో వారిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. ఆ త‌రువాత కొన్నాళ్ల‌కు.. క్విగ్లే జ‌స్టిన్ స‌వ‌తి తండ్రి జెఫ్‌తో ప్రేమ‌లో ప‌డింది. ఈ విష‌యాన్ని జెఫ్‌కు చెప్ప‌గా అత‌డు కూడా ఆమెనే ప్రేమిస్తున్న‌ట్లు చెప్పాడు. దీంతో.. క్విగ్లే త‌న కంటే వ‌య‌సులో 29 ఏళ్ల పెద్దవాడు.. ఒక‌ప్పుడు త‌న‌కు మామ అయిన జెఫ్‌ను వివాహం చేసుకుంది. కొన్నాళ్లు జస్టిన్‌కు భార్యగా సేవలందించిన ఆమె.. ఇప్పుడు తన మాజీ భర్తకు పిన తల్లిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అయితే, ఆమెకు పుట్టిన బిడ్డ బాధ్యతలను మాత్రం మాజీ భర్త జస్టిన్‌కే అందించింది. ఆ ముగ్గురు ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు.

కాగా దీనిపై జస్టిన్‌ మాట్లాడుతూ.. ఎరికా మీద ఎలాంటి కోపం లేద‌ని.. ఆమె త‌న మ‌న‌సుకు న‌చ్చిన పని చేసింద‌న్నాడు. ప్ర‌స్తుతం అంతా బాగానే ఉంద‌ని.. ఇక బిడ్డ బాధ్యతను నాకే అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.
Next Story