అచ్చం సినిమాలోలాగానే.. భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య..!
Wife sells her husband for 15 Crores at Bhopal.అచ్చం సినిమాలోలాగానే.. భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య..
By తోట వంశీ కుమార్
'చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక.. తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక' ఈ పాట ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. శుభలగ్నం సినిమాలోనిది. ఈ చిత్రంలో ఆమని ధనవంతురాలు అయిపోవాలని ఆశపడి.. భర్త జగపతిబాబును రోజాకు కోటీ రూపాయలు అమ్ముతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటననే మనదేశంలో జరిగింది. అయితే.. ఇక్కడ భర్తను అమ్మింది కోటి రూపాయలకు కాదు.. రూ.1.5కోట్లకు అంతే. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో రాజధాని భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఓ బాలిక ఆశ్రయించింది. తన తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని, తన తల్లితో నిత్యం గొడవ పడుతున్నాడని తెలిపింది. వీరిద్దరి గొడవల కారణంగా తనకు, తన చెల్లెలికి చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామని చెప్పింది. బాలిక తల్లిదండ్రులను కౌనిల్సింగ్‌కు పిలిపించగా.. తండ్రికి మరొక స్త్రీతో సంబంధం ఉందని వెల్లడైంది. పైగా అతను ఆ మహిళతోనే ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు.
అయితే.. ఇందుకు భార్య ఒప్పుకోలేదు. తొలుత విడాకులు ఇచ్చేందుకు అంగీకరించని భార్య తరువాత ఓ షరతుపై అంగీకరించింది. భర్తకు విడాకులు ఇవ్వాలంటే.. ఒక ఖరీదైన ఫ్లాట్‌తో పాటు పెద్ద మొత్తంలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందుకు భర్త ప్రియురాలు అంగీకరించింది. తన భర్త ప్రవర్తన నచ్చలేదని, బిడ్డల కోసమే విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకున్నానని సదరు మహిళ తెలిపింది.