కొట్టుకువ‌చ్చిన 1840 కాలం నాటి వెండినాణేలు.. పోటీ ప‌డుతున్న జ‌నం

Villagers found Silver coins in the river of Madhya Pradesh.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వ‌ర‌ద‌లు భీభ‌త్సం సృష్టించిన సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2021 4:35 AM GMT
కొట్టుకువ‌చ్చిన 1840 కాలం నాటి వెండినాణేలు.. పోటీ ప‌డుతున్న జ‌నం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వ‌ర‌ద‌లు భీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. చాలా ఇండ్లు కొట్టుకుపోగా.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా సింధ్ న‌ది ఉప్పొంగింది. దీంతో న‌ది ఒడ్డు కోత‌కు గురైంది. మ‌రీ ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో తెలీదు కానీ.. న‌దిలో వెండి నాణేలు తేలుతూ వ‌చ్చాయి. అశోక్ న‌గర్‌లోని పంచ‌వాలి గ్రామంలో ఒడ్డుకు వెండి నాణేలు కొట్టుకువ‌చ్చాయి. నిన్న మొన్న‌టి ఉప్పొంగిన న‌ది.. ఆదివారం కాస్త శాంతించింది. న‌ది తీరంలో మెరుస్తున్న వెండి నాణేలు ప‌లువురికి దొరికాయి.

ఈ విష‌యం దావానంలా వ్యాపించింది. వెంట‌నే పంచ‌వాలి గ్రామ‌స్థులు న‌ది ఒడ్డుకు భారీ సంఖ్య‌లో చేరుకున్నారు. ఆ బురద నీటిలో నాణేలు ఏరుకునేందుకు పోటి ప‌డ్డారు. నాదీ అంటే నాదీ అంటూ కొంద‌రు గొడ‌వ‌కు కూడా దిగారు. అయితే.. ఈ వెండి నాణేలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. నాణేలపై బ్రిటిష్ రాణి విక్టోరియా బొమ్మలున్నాయి. 1840లో ఈస్ట్ ఇండియా కంపెనీ వీటిని ముద్రించినట్లు తెలుస్తుంది. మొదట్లో రెండు నాణేలు లభించాయి. ఆ తర్వాత గ్రామస్తులు వెతికితే ఏడెనిమిది వరకు దొరికాయి. అయితే.. నాణేలు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవ్వ‌రీకి తెలీదు.

కాగా.. దీనిపై కొలరాస్‌ ఎస్‌డీపీఓను సంప్రదించగా .. సోష‌ల్ మీడియా ద్వారానే త‌మ‌కు నాణేల గురించి తెలిసింద‌న్నారు. దీనిపై ద‌ర్యాప్తు చేసేందుకు స్టేష‌న్ ఇన్‌చార్జిని పంపిన‌ట్లు తెలిపారు. కాగా.. ఎవ‌రైనా పాత నాణేలు సేకరించే అల‌వాటు ఉన్న‌వారు వీటిని సేక‌రించి ఇంట్లో దాచి ఉండ‌గా.. వ‌ర‌ద‌ల కార‌ణంగా కొట్టుకుని వ‌చ్చిన‌ట్లుగా బావిస్తున్న‌ట్లు ప‌లువురు తెలిపారు. త‌మ‌ను కూడా అదృష్టం వ‌రిస్తుందని గ్రామ‌స్తులు న‌ది తీరాన్ని జ‌ల్లెడ ప‌డుతున్నారు.

Next Story