చెప్పును దొంగిలించిన పాము..!

Video Of Snake Slithering Away With Slipper Leaves Internet In Splits. పాములను చూస్తే చాలు ఎంతో మందికి హడల్..! వాటిని రెచ్చగొడితే తప్ప కాటేయవని

By M.S.R  Published on  25 Nov 2022 10:40 AM GMT
చెప్పును దొంగిలించిన పాము..!

పాములను చూస్తే చాలు ఎంతో మందికి హడల్..! వాటిని రెచ్చగొడితే తప్ప కాటేయవని నిపుణులు చెబుతూ ఉంటారు.. కానీ చాలా మంది పాములను చూస్తే చాలు చంపేయడమే పనిగా పెట్టుకుంటారు. అలా చేయడం వలన పాములు అంతరించి.. నేచర్ బ్యాలెన్స్ తప్పుతుంది. పంటలను పాడు చేసే ఎలుకలను పాములు చంపేస్తూ.. రైతులకు సహాయం చేస్తూ ఉంటాయి.

ఇక పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ పాము చెప్పును నోట కరుచుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్షల్లో ఆ వీడియోకు వ్యూస్ వస్తున్నాయి. పాము ఓ ఇంటి ముందుకు వచ్చి.. చెప్పును నోట కరుచుకుని వెళ్ళిపోయింది. వీడియో తీసిన వాళ్లు కూడా నవ్వడం మనం ఈ వైరల్ వీడియోలో వినొచ్చు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పంచుకున్న ఈ చిన్న వీడియోలో, ఒక పాము రబ్బరు చెప్పును పట్టుకుని వెళ్లిపోయినట్లు చూపిస్తుంది. "I wonder what this snake will do with that chappal. He got no legs. Unknown location,"అని కస్వాన్ పోస్ట్ చేశారు. ఇక నెటిజన్ల నుండి ఈ వీడియోకు భారీగా స్పందన వస్తోంది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో అనే వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story