కుర్కురే కొనుక్కరాలేదని.. భర్తను విడిచి పెట్టిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక మహిళ తన భర్త కుర్కురే ప్యాక్ కొనుక్కు రాలేదని అతని ఇంటిని వదిలి వెళ్లిపోయింది.
By అంజి Published on 14 May 2024 11:18 AM GMTకుర్కురే కొనుక్కరాలేదని.. భర్తను విడిచి పెట్టిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక మహిళ తన భర్త కుర్కురే (పఫ్‌కార్న్ స్నాక్స్ బ్రాండ్) ప్యాక్ కొనుక్కు రాలేదని అతని ఇంటిని వదిలి వెళ్లిపోయింది. వివరాల ప్రకారం.. కుర్కురే తినే అలవాటు ఉన్న మహిళ.. రోజూ తన కోసం కుర్కురే ప్యాకెట్ తీసుకురావాలని భర్తను డిమాండ్ చేసేది. అయితే, ఆ వ్యక్తి ఇటీవల ఒకరోజు చిరుతిండి కొనడం మరిచిపోవడంతో గొడవ పడి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ మహిళ నెలన్నర రోజులుగా తన తండ్రి ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం.తరువాత, వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. అక్కడ మహిళ తన భర్త శారీరక వేధింపులను ఆరోపించింది. అదే కారణంతో అతని ఇంటిని విడిచిపెట్టిందని చెప్పింది.
అయితే, తన భార్య రోజువారీ స్నాక్స్ కోసం డిమాండ్ చేయడంపై వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వారి కేసు కుటుంబ సలహా కేంద్రానికి రిఫర్ చేయబడింది. అక్కడ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యాభర్తలు కొన్ని రోజుల తర్వాత మరో సెషన్‌కు తిరిగి రావాలని కోరారు. ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, కౌన్సెలర్ మాట్లాడుతూ.. కుర్కురే పట్ల మహిళకు ఉన్న విపరీతమైన అభిమానాన్ని తాను గుర్తించానని, అదే వారి వివాదానికి కారణమని తెలుస్తోందని చెప్పారు. ఈ జంట 2023 లో వివాహం చేసుకున్నారు. భార్య ప్రతిరోజూ తన భర్త ఆఫీసు నుండి తిరిగి వచ్చినప్పుడు అతని నుండి 5 రూపాయల విలువైన కుర్కురే ప్యాకెట్ డిమాండ్ చేసేది.