ప్రేయసి పెళ్లిలో మాజీ ప్రియుడి ఎంట్రీ.. దండలు మార్చుకుంటుండగా మధ్యలో దూరి
UP man puts Sindoor on bride's head in front of groom.తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుండడాన్ని
By తోట వంశీ కుమార్ Published on 7 Dec 2021 8:26 AM ISTతాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుండడాన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా సరే ఆ యువతిని దక్కించుకోవాలనుకున్నాడు. అందుకోసం పెద్ద సాహసమే చేశాడు. పెళ్లి మండపానికి వెళ్లాడు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు దండలు మార్చుకుంటుండగా.. మధ్యలో దూరాడు. అంతటితో ఆగకుండా పెళ్లి కూమారై నుదిటిపై సింధూరాన్ని రుద్దాడు. మరీ వధువు ఏం చేసింది..? వరుడు ఎలా రియాక్ట్ అయ్యాడు..? బంధువులు చూస్తూ ఊరుకున్నారా..? ఇలా సినిమాను తలపించేలా ఉన్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. బంధుమిత్రుల హడావుడితో అక్కడ అంతా కోలాహలంగా ఉంది. మరికొద్దిసేపటిలో వివాహా తంతు కూడా పూర్తి కానుంది. వధూ వరులు దండలు మార్చుకుంటుండగా.. ఇంతలో వారిద్దరి మధ్యలోకి ఓ యువకుడు దూరాడు. వధువు నుదిటిపై కుంకుమ దిద్దడానికి యత్నించాడు. వెంటనే అప్రమత్తం అయిన వధువు తన ముఖంపై పరదా కప్పుకునే ప్రయత్నం చేయగా.. బలవంతంగా దాన్ని తీసి.. ఆమె నుదిపై సింధూరాన్ని దిద్దాడు. ఊహించని ఈ ఘటనతో అక్కడ ఉన్నవారికి ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు.
వెంటనే తేరుకున్న బంధులు.. ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. పెళ్లి వేడుకను వీడియో తీస్తుండగా..ఈ దృశ్యాలన్నీ అందులో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వధువు నుదిటిపై తిలకం దిద్దిన యువకుడు ఎవరా అని చూడగా.. మాజీ ప్రేమికుడని తెలిసింది. కాగా.. తనను ప్రేమించాలని కొద్ది నెలల క్రితం ఆ యువకుడు యువతి వెంటపడ్డాడు. అయితే.. యువతి అతడి ప్రేమను తిరస్కరించింది. అదే సమయంలో అతడు పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయం అయింది. విషయం తెలుసుకున్న ఆ యువకుడు పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని ఇలా చేశాడు.
కాగా.. ఈ రచ్చ ఇంతటితో ముగిసిపోలేదు. యువకుడు చేసిన పనితో ఆరోజు పెళ్లిని రద్దు చేశారు. మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన వరుడితోనే యువతి పెళ్లిని జరిపించారు. కాగా.. ఎంత ప్రయత్నించినప్పటికి మాజీ ప్రియుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.