గుట్కా కార‌ణంగా పెళ్లి ఆగిపోయింది

UP girl refuses to marry as groom chews 'gutka'.చాలా చోట్ల పెళ్లి అంటే.. వరుడి కోర్కెలు.. వరుడి బంధువుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2021 1:45 PM IST
గుట్కా  కార‌ణంగా పెళ్లి ఆగిపోయింది

చాలా చోట్ల పెళ్లి అంటే.. వరుడి కోర్కెలు.. వరుడి బంధువుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడమే. పెళ్ళికొడుకు ఎలా చెబితే అలా పెళ్లి జరుగుతుంది. ఇక పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆలోచనలతో సంబంధం లేదు. ఆమె చెప్పేమాట వినే పరిస్థితీ ఉండదు. ఒకవేళ పీటల మీద కూచున్నాకా పెళ్ళికొడుకు నాకు ఫలానా కావాలి అంటే ఇవ్వాల్సిందే. లేకపోతే పెళ్ళిళ్ళు ఆగిపోయి..వీధిన పడ్డ ఆడపిల్లలు ఎందరో లెక్కలు కూడా ఎవరూ చెప్పలేరు. కానీ.. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. పెళ్లి కూతురు తనకి కావలసింది ఏమిటో ఖ‌చ్చితంగా చెబుతోంది. కొన్ని చోట్ల వరుడు తనకు సరిపోడు అనిపించినపుడు ఏ మాత్రం సంకోచించ‌కుండా తన అభిప్రాయం చెప్పి ఆ పెళ్లిని వదులుకోవడానికి సిద్ధం అవుతున్నారు నేటి యువతులు. వారికి అండగా వారి కుటుంబమూ నిలబడుతోంది. ఇదిగో ఇప్పుడు మీకు చెప్పబోయే సంఘటన అటువంటి యువతికి సంబంధించిందే.

ముహుర్తం స‌మ‌యంలో వ‌రుడు గుట్కా న‌ములుతున్న విష‌యాన్ని వ‌ధువు గ్ర‌హించింది. దీంతో త‌న‌కు ఈ పెళ్లి వ‌ద్దంటూ వ‌ధువు స్ప‌ష్టం చేసింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాలియా జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళితే.. మిశ్రౌలి గ్రామానికి చెందిన ఓ యువ‌తితో కేజూరి గ్రామ‌వాసికి జూన్ 5న పెళ్లి చేయాల‌ని నిశ్చ‌యించారు. ఆ రోజున పెళ్లి మండ‌పానికి వ‌చ్చిన వ‌రుడు గుట్కా న‌ములుతూ వ‌ధువుకు క‌నిపించాడు. దీంతో త‌న‌కు వ‌రుడు గుట్కా న‌మ‌ల‌డం న‌చ్చ‌లేద‌ని, ఈ పెళ్లి వ‌ద్ద‌ని త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. ఇరు కుటుంబాల పెద్ద‌లు వ‌ధువుకు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆమె విన‌లేదు. దీంతో చేసేది ఏమీ లేక పెళ్లిని ఆపేసారు. పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న క‌ట్న‌కానుక‌ల‌ను తిరిగి ఇచ్చేశారు.

Next Story