బాయ్‌ఫ్రెండ్ కోసం నడిరోడ్డుపై యువతుల సిగపట్లు.. వీడియో వైరల్
Two girls fight over boyfriend on street in jamshedpur.ఓ అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం మనం
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2021 4:31 AM GMT
ఓ అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం మనం చూశాం. కానీ.. ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ మరో యువతితో తిరుగుతుండడాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ఓ యువతి తట్టుకోలేకపోయింది. దీంతో నడిరోడ్డు మీద బాహాబాహాకి దిగింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని సరాయకేలాలో బుధవారం సాయంత్రం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన బాయ్‌ఫ్రెండ్ మరో యువతితో తిరుగుతుండడాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మరో యువతి తట్టుకోలేకపోయింది. ఆమె జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది.ఆమె కూడా ఎదురుతిరిగింది. అతను నా ప్రియుడు అంటూ వాదించింది. దీంతో సీన్ రసవత్తరంగా మారింది. ఇద్దరూ నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. కిందపడి మరీ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తున్నా వారు ఆగలేదు సరికదా మరింతగా రెచ్చిపోయారు. ఓ యువకుడు, ఓ యువతి వారిని అతి బలవంతంగా విడిపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకునే లోపే యువతులిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతన్నారు.