జీవితానికి ఐదు సూత్రాలు తెలిపిన వందేళ్ల బామ్మ.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Throw your smartphones away, give smiles: This 100-year-old's five life advice inspires the internet. దాదాపు వందేళ్లు ఉన్న ఓ బామ్మ మంచి జీవితానికి ఐదు సూత్రాలు

By Medi Samrat  Published on  21 Feb 2021 12:37 PM IST
100-year-olds five life advice inspires

దాదాపు వందేళ్లు ఉన్న ఓ బామ్మ మంచి జీవితానికి ఐదు సూత్రాలు వెల్లడిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆ బామ్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆ వీడియో ఒక రోజులోనే 50వేలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. లియోనారా రేమాండ్‌ అనే బామ్మ సోషల్‌ మీడియాలో ఓ చిన్న వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో ద్వారా ఎంతో మంది నెటిజన్ల మనసులను గెలుచుకుంది. అందమైన డ్రెస్‌ వేసుకుని, తలపై టోపీ పెట్టుకుని వెనుక నుంచి వచ్చే పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ ఐదు సూత్రాలను చెబుతున్న వీడియో హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే తన అధికారిక ఖాతాల్లో పోస్టు చేశారు.

ఖచ్చితంగా అవసరం వచ్చేంత వరకు ఒంటరిగా ఉండండి. మీ స్మార్ట్‌ ఫోన్‌లను పక్కనపెట్టేయండి. ప్రతి సంవత్సరం ఒక నెల జీతం ఆదా చేసుకోండి. జీవితాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. బాధతో ఉన్నవారికి మీ చిరునవ్వు ఇవ్వండి అని ఐదు సూత్రాలను తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియో 50వేలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ బామ్మ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు అవును ఇవి నిజమే అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఎంతో నచ్చిందని, తప్పకుండా పాటించాల్సిన సూత్రాలు.. థాంక్యూ బామ్మ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. బామ్మకు ఇంత వయసు వచ్చినా చేతులను ఊపుకొంటూ జీవితానికి సంబంధించి ఐదు సూత్రాలు తెలుపడం గొప్పవిషయమంటున్నారు నెటిజన్లు. బామ్మ చెప్పిన ఆ ఐదు సూత్రరాలు జీవితంలో ఉపయోగపడేవేనని కామెంట్ల చేస్తున్నారు.




Next Story